మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సాన్‌టీనా జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇటీవల కొన్ని ఓటములతో వెంట సాగిన సానియా మీర్జా- హింగిస్ జోడీ తాజాగా విజయపరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ జోడి వానియా కింగ్-కుద్రయెత్సొవా జంటపై 6-2, 6-0 వరుస సెట్లతో విజయం సాధించింది. ఈ విజయంతో సానియా మీర్జా జోడీ మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్‌లో చోటు సంపాదించుకుంది.
ప్రపంచ నెంబర్ వన్ జోడీ అనిపించుకున్న సానియా మీర్జా-హింగిస్ జోడీ 2015 ఆగస్టు నుంచి 2106 మార్చి వరకు 41 వరుస విజయాల్ని నమోదు చేసుకుంది. ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ, సాన్-టీనా జోడీ గెలుపు బాట పట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో సాన్ టీనా జోడీ మెరుగ్గా రాణించకపోయినా.. మాడ్రిడ్ ఓపెన్‌లో మళ్లీ పుంజుకుంది.