Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిక్కుల్లో అజారుద్దీన్ : మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు

Advertiesment
azaruddin
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (18:34 IST)
హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయం అంశంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అజారుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు అందింది. 
 
టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల అజారుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి... పదవి నుంచి తొలగించాలని బీసీ రాజకీయ ఐకాస నాయకులు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. 
 
క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడైన అజారుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ నిర్వాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఐకాస ఛైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ కోరారు.
 
జింఖానా మైదానం వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ఉప్పల్‌లో జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్‌కు ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందిందని పేర్కొన్నారు.
 
క్రీడాభిమానుల నుంచి కోట్ల రూపాయలు దండుకొని... టికెట్ల విషయంలో సరైన ఏర్పాట్లు చేయని... హెచ్‌సీఏ ఇతర రాజకీయ నాయకులు క్షతగాత్రులను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
 
మరోవైపు, ఈ టిక్కెట్ల విక్రయం, తొక్కిసలాటపై అజారుద్దీన్ స్పందించారు. టిక్కెట్ల విక్రయానికి హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ తెలిపారు. టిక్కెట్ల విక్రయాల్లో హెచ్‌సీఏ నుంచి ఎలాంటి పొరపాట్లు జరగలేదని సమర్థించుకున్నారు.
 
మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పేటీఎం ద్వారా టిక్కెట్లు విక్రయించామని స్పష్టం చేశారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్నారనే వదంతులు ఎలా వచ్చాయో తెలియదన్నారు. 
 
అలాగే, గురువారం జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు. బాధితులందరికీ హెచ్‌సీఏ తరపున వైద్యం అందిస్తామని అజారుద్దీన్ తెలిపారు. టిక్కెట్ల విక్రయాల బాధ్యత పేటీఎంకు ఔట్ సోర్సింగ్‌ ఇచ్చామన్నారు. విక్రయానికి హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను కూడా మానవ మాత్రుడినే.. కూల్ కెప్టెన్ ఎలా అయ్యానంటే?