Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెప్టెన్ కూల్ శకం ముగిసినట్లే.. పుణే జట్టు నుంచి వైదొలిగినా, తొలగించబడినా అర్థం అదే..!

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్రకెక్కిన మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఇక ఏ టీమ్‌కి కూడా కెప్టెన్ కాడు. ఐపీఎల్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకర

Advertiesment
Mahendra Singh Dhoni
హైదరాబాద్ , సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (07:49 IST)
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్రకెక్కిన మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఇక ఏ టీమ్‌కి కూడా కెప్టెన్ కాడు. ఐపీఎల్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం కాకముందే కెప్టెన్ బాధ్యతలనుంచి తప్పుకున్న లేదా తప్పించబడిన ధోనీ క్రికెట్ కెరీర్ చరమాంకంలో పడినట్లే లెక్క. టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్ బాధ్యతలనుంచి స్వచ్చందంగా తప్పుకున్న ధోనీకి ఐపీఎల్ పుణే జట్టు యాజమాన్యం మూడో అవకాశం ఇవ్వకుండా ఉద్వాసన పలకటం ధోనీ కెరీర్‌లో అత్యంత అవమానకరమైన చర్యగా క్రికెట్ నిపుణులు వర్ణిస్తున్నారు.
 
ఇటీవల టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10వ సీజన్‌కు కు సంబంధించి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ధోనిని తొలగించారు. ఈ మేరకు ఆదివారం పుణె యాజమాన్యం తుది నిర్ణయం తీసుకుంది. గతేడాది ధోని నేతృత్వంలో పుణె సూపర్ జెయింట్స్ పేలవమైన ఆట తీరుతో టాప్-4లో స్థానం సంపాదించలేకపోయింది. గత ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ జట్టుతో పాటు, పుణె సూపర్ జెయింట్స్ లు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ లీగ్ దశలో గుజరాత్ టాప్ లో నిలిస్తే, పుణె చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
 
ఐపీఎల్ 9 సీజన్ లో 14 మ్యాచ్లా డిన పుణె.. కేవలం ఐదు విజయాల్ని మాత్రమే నమోదు చేసి యాజమాన్యం పెట్టుకున్న ఆశలను వమ్ము చేసింది. ఈ క్రమంలోనే  ఏడో స్థానానికి పరిమితమైంది పుణె.  మరొకవైపు ధోని కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.  12 ఇన్నింగ్స్ ల్లో ఒక హాఫ్ సెంచరీ సాధించి 284 పరుగులు సాధించాడు. ఈ అంశాలను నిశితంగా పరిశీలించిన పుణె యాజమాన్యం.. ధోనిని కెప్టెన్ గా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో ఆస్ట్రేలియా కు చెందిన స్టీవ్ స్మిత్ ను కొత్త కెప్టెన్ గా నియమించింది. 
 
ధోని కెప్టెన్సీపై పుణె యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదిగానే చెప్పొచ్చు. 2010, 11ల్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్స్ ను సాధించడంలో ధోని పాత్ర వెలకట్టలేనింది. దాంతో పాట 2010, 14 చాంపియన్స్ లీగ్ టైటిల్స్ ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ సాధించింది. గతేడాది ఐపీఎల్లోకి అడుగుపెట్టిన పుణె.. కెప్టెన్ గా ధోనిని తొలగించడం తొందరపాటు నిర్ణయంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుణె సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ నుంచి ధోనీకి ఉద్వాసన