Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెన్‌స్టోక్స్ క్షమాపణలు.. ఫ్యాన్స్‌కు అంత నోటి దురుసు అవసరమా? (video)

Advertiesment
బెన్‌స్టోక్స్ క్షమాపణలు.. ఫ్యాన్స్‌కు అంత నోటి దురుసు అవసరమా? (video)
, ఆదివారం, 26 జనవరి 2020 (12:07 IST)
నోటి దురుసు కారణంగా ఇంగ్లండ్ క్రికెటర్ బెన్‌స్టోక్స్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. బెన్ స్టోక్స్‌ను ఓ ఫ్యాన్ దూషించాడు. ఆ సమయంలో ఆగ్రహాన్ని నియంత్రించుకోలేక బెన్ స్టోక్స్ కూడా అసభ్య పదజాలంతో ఆ అభిమానిని తిట్టాడు. 
 
ఈ సంఘటన మైక్‌లో రికార్డు కావడం, పత్యక్ష ప్రసారం అవ్వడంతో పాటు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చివరికి తన తప్పు తెలుకుని స్టోక్స్‌ ఆ ఘటనలో తాను హుందాగా ప్రవర్తించలేదని అంగీకరించాడు తాను ఔట్ అయ్యాక వాడిన భాషకు క్షమాపణలు తెలియజేస్తున్నా.
 
తాను కోపంలో అలా స్పందించాను. డ్రస్సింగ్‌ రూమ్‌కు వెళ్తున్నప్పుడు ప్రేక్షకుల్లో ఒకరు నన్ను పదేపదే దూషించారు. అప్పుడే అలాంటి భాషను వాడాల్సి వచ్చిందని బెన్ స్టోక్స్ వివరణ ఇచ్చాడు. 
 
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు స్టోక్స్‌ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. గ్రౌండ్‌ నుంచి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వస్తున్నప్పుడు అతడిని ఓ అభిమాని దూషించాడు. ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోలేకపోయిన స్టోక్స్‌ అసభ్యంగా ఆ అభిమానిని తిట్టాడు. ఈ సందర్భంలో తాను హుందాగా వ్యవహరించాల్సిందని అంగీకరించాడు. అందుకు క్షమాపణలు కూడా చెప్పాడు. 
 
ప్రత్యేకించి మ్యాచులను టీవీల్లో వీక్షిస్తున్న చిన్నారులు, యువతకు సరైన సందేశం ఇచ్చేలా తన ప్రవర్తన లేదని ఒప్పుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో సారీ చెప్పాడు. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
క్రికెట్ ఫ్యాన్స్ కూడా క్రికెటర్లపై వాడే భాష హుందాగా వుండాలంటున్నారు. తమ అభిమాన క్రికెటర్లు అవుటైతే కోపాన్ని వేరే విధంగా వ్యక్తం చేయాల్సింది. లేకుంటే క్రీడను స్పోర్టివ్‌గా తీసుకోవాల్సింది. అలా కాకుండా క్రికెటర్లను దూషించడం కూడా సరికాదని క్రీడా పండితులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా బెన్ సారీ చెప్పడంతో ఐసీసీ నిషేధం వేటు నుంచి తప్పించుకున్నాడని చెప్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు రాకపోతే.. మేమూ రాము.. బీసీసీఐకి పీసీబీ బెదిరింపు (video)