Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోర్డును ధిక్కచించి ఆ ఇద్దరు క్రికెటర్లు.. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ నుంచి మొండిచేయి

bcci

వరుణ్

, గురువారం, 29 ఫిబ్రవరి 2024 (10:44 IST)
బోర్డును ధిక్కరించిన తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న యంగ్ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తేరుకోలేని షాకిచ్చింది. బీసీసీఐ ప్రకటించే వార్షిక కాంట్రాక్టుల నుంచి వారిద్దరిని తప్పించింది. ఈ మేరకు తాజాగా 2024 సంవత్సరానికి గాను ఈ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. 
 
జాతీయ జట్టుకు ఆడనప్పుడు దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న బీసీసీఐ సూచనను శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ పెడచెవిన పెట్టారు. రంజీ మ్యాచ్‌లో ఆడకపోగా, ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేశారు. అందుకు వీరిద్దరూ భారీ మూల్యమే చెల్చించారు. వారిద్దరిపై కాంట్రాక్టుల్లో వేటు పడింది. అసలే గ్రేడ్‌లోనూ వారిద్దరి పేర్లను చేర్చకుండా బోర్డు తన తడాఖా చూపింది.
 
ఇక, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌లకు ఏ గ్రేడ్‌కు ప్రమోషన్ ఇచ్చింది. ఏ ప్లస్ గ్రేడ్‌లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. రోహిత్ శర్మ, జస్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలకు మాత్రమే ఈ గ్రేడ్‌లో ఉంచింది. 
 
అలాగే, ఏ గ్రేడ్‌లో కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, శుభ్ మాన్ గిల్‌లకు చోటు కల్పించగా, బి గ్రేడ్‌లో కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌లు, సి గ్రేడ్‌లో తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, అవేష్ ఖాన్, కేఎస్ భరత్, ప్రసిద్ధ కృష్ణ, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అర్షదీప్ సింగ్, ముఖేశ్ కుమార్, శివమ్ దూబే, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్‌లు ఉన్నారు.
 
ఇకపోతే, ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్‌లో ఉమ్రాన్ మాలిక్, ఆకాశ్ దీప్, విద్వంత్ కావేరప్ప, విజయ్ కుమార్, యశ్‌దయాళ్‌లకు చోటు కల్పించింది. ఈ కాంట్రాక్టులను 2023 అక్టోబరు 1 నుంచి వర్తింపజేయనున్నారు. ఈ కాంట్రాక్టులు 2024 సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధర్మాశాల వేదికగా ఐదో టెస్ట్ మ్యాచ్ : కేఎల్ రాహుల్ దూరం!!