Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెటర్లకు వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ సెక్రటరీ జై షా!!

jaishah

వరుణ్

, ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (12:22 IST)
భారత క్రికెటర్లకు బీసీసీఐ సెక్రటరీ జై షా వార్నింగ్ ఇచ్చారు. రంజీ మ్యాచ్‌లలో ఆడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు, భారత్-ఏ జట్టు ప్లేయర్లు సహా ఇతర క్రికెటర్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని తేల్చి చెప్పారు. దేశీయ క్రికెట్ ఆడని ప్లేయర్లు తీవ్రమైన ఇబ్బందుల్లో పడతారని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జాతీయ జట్టులోకి ప్లేయర్ల ఎంపికలో దేశవాళీ క్రికెట్లో ప్రదర్శన అత్యంత కీలకమవుతుందని, దేశవాళీ క్రికెట్ ఆడని ఆటగాళ్లు తీవ్రమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఆటగాళ్లను హెచ్చరించారు. ఈ మేరకు జై షా రాసిన లేఖను జాతీయ మీడియా సంస్థ ఓ మీడియా సంస్థ ప్రచురించింది. దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎఎల్‌కే అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై జై షా ఆందోళన వ్యక్తం చేశారు.
 
'ఇటీవలి మొదలైన కొత్త ట్రెండ్ ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎఎల్‍కే అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది అనూహ్యమైన మార్పు. దేశవాళీ క్రికెట్ ఎల్లప్పుడూ భారత క్రికెట్ నిలబెట్టే పునాదివంటిది. దేశవాళీ క్రికెట్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. భారత క్రికెట్‌పై మా దృక్పథం మొదటి నుంచి సుస్పష్టంగా ఉంది. టీమిండియాకి ఆదాలని ఆకాంక్షించే ప్రతి క్రికెటర్ దేశీయ క్రికెట్‌లో తమని తాము నిరూపించుకోవాలి. దేశవాళీ క్రికెట్లో ప్రదర్శన జాతీయ జట్టులోకి ఎంపికకు ముఖ్యమైన ప్రమాణికం. దేశవాళీ క్రికెట్లో పాల్గొనకపోవడం తీవ్రమైన చిక్కులను తెచ్చిపెడుతుంది' అని లేఖలో జైషా పేర్కొన్నారు.
 
సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ పర్యటన నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లను ఆడేవారంటూ జైషా ప్రస్తావించారు. దేశీయ క్రికెట్‌ను కేవలం నిబంధనగా భావించకుండా బాధ్యతగా, గర్వంగా భావించాలని జైషా సూచించారు. కాగా ఐపీఎల్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో సన్నద్ధత కోసం ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్ వంటి స్టార్ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌కు గైర్హాజరు అవుతున్నారు. బరోడాలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా శిక్షణ తీసుకుంటున్నారు. ఇది బీసీసీఐ పెద్దలకు తీవ్ర ఆగ్రహం తెప్చించింది. దీంతో ఆయన ఈ తరహా హెచ్చరికలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్ కోట్ టెస్టు: యశస్వి జైస్వాల్ రెండో సెంచరీ