Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెత్తగా ఆడాం.. చిత్తుగా ఓడాం.. బంగ్లా కెప్టెన్ షకీబుల్ హాసన్

క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టు చేతిలో చిత్తుగా ఓడటంపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబుల్ హాసన్ స్పందిస్తూ, ఈ సిరీస్‌లో చెత్తగా ఆడి.. చిత్తుగా ఓడినట్టు చెప్పారు.

Advertiesment
చెత్తగా ఆడాం.. చిత్తుగా ఓడాం.. బంగ్లా కెప్టెన్ షకీబుల్ హాసన్
, శుక్రవారం, 8 జూన్ 2018 (12:56 IST)
క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టు చేతిలో చిత్తుగా ఓడటంపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబుల్ హాసన్ స్పందిస్తూ, ఈ సిరీస్‌లో చెత్తగా ఆడి.. చిత్తుగా ఓడినట్టు చెప్పారు.
 
ఇరు జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ వైట్‌వాష్‌ అయ్యింది. ఏ గేమ్‌లోనూ ఆకట్టుకోలేకపోయిన బంగ్లాదేశ్‌.. తమకంటే ఎంతో జూనియర్‌ జట్టైన ఆప్ఘాన్ చేతిలో ఘోరపరాభవం చూసింది. గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన చివరిదైన మూడో టి20లో ఆఫ్ఘాన్ ఒక పరుగుతో విజయం సాధించింది. 
 
ఈ సిరీస్ వైట్‌వాష్‌పై షకీబుల్ హాసన్ మాట్లాడుతూ, 'సిరీస్‌ ఓటమిపై సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంది. నేను గతంలో ఎప్పుడూ ఈ తరహా పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయలేదు. మా జట్టులో బౌలర్‌ అయినా, బ్యాట్స్‌మెన్‌ అయినా వారి వారి ప్రదర్శనపై పునరాలోచించుకోవాలి అని సూచించారు. 
 
ఇకపోతే, మా జట్టులో మానసిక పరిపక్వత లోపించినట్లు కనబడింది. ఓవరాల్‌గా మా ప్రదర్శనతో సిరీస్‌ గెలిచే అర్హత లేదనేది అర్థమైంది. మూడు విభాగాల్లోనూ పూర్తిగా విఫలయమ్యాం. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులకు తగ్గట్టు ఆడింది. ప్రత్యర్థి జట్టులో రషీద్‌ ఖాన్‌ కీలక ఆటగాడు. అతను మ్యాచ్‌లను గెలిపించిన తీరు అమోఘం అని షకీబుల్ కొనియాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిఫా ప్రపంచ కప్- ఫేవరేట్‌గా బెల్జియం.. నిలకడగా ఆడితే టైటిల్ ఖాయమా?