Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్... ఆసియాకప్ విజేత

కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఆసియా ట్వంటీ20 క్రికెట్ కప్ ఫైనల్ పోటీలో భారత మహిళల క్రికెటర్లకు బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ టోర్నీలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్

భారత్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్... ఆసియాకప్ విజేత
, ఆదివారం, 10 జూన్ 2018 (16:15 IST)
కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఆసియా ట్వంటీ20 క్రికెట్ కప్ ఫైనల్ పోటీలో భారత మహిళల క్రికెటర్లకు బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ టోర్నీలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టును బంగ్లాదేశ్ మహిళలు చిత్తు చేశారు. ఫలితంగా ఆసియా కప్‌ను బంగ్లాదేశ్ తొలిసారి ముద్దాడింది. ఈ గెలుపుతో ఆరుసార్లు ఆసియా కప్‌ను గెలుచుకున్న భారత మహిళల జట్టుకు బ్రేక్ వేసినట్టయింది.
 
స్థానిక కిన్రారా అకాడమీ ఓవల్‌లో జరిగిన మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టుపై బంగ్లాదేశ్ మూడు వికెట్లతో విజయం సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 42 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
ఆ తర్వాత 113 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మహిళలు... ఏడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. పూనమ్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో బంగ్లా బ్యాట్స్‌విమెన్‌ను హడలెత్తించింది. దీంతో చివరి బంతి వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చివరి ఓవర్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తప్పింది. 
 
అయితే, చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన తరుణంలో జహానా ఆలం బంతిని మిడ్ వికెట్ మీదుగా ఆడి రెండు పరుగులు సాధించి బంగ్లాదేశ్‌కు అపూర్వ విజయం అందించింది. తొలిసారి ఆసియా కప్ ఫైనల్‌కు వచ్చిన బంగ్లాదేశ్ మొదటిసారే కప్పును ఎగరేసుకుపోయింది. రుమానా అహ్మద్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు' లభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ : కెన్యాతో భారత్ ఢీ