Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''అజర్'' సినిమాపై అజారుద్ధీన్ మాజీ భార్య టెన్షన్ టెన్షన్ ఎందుకు?

Advertiesment
Azhar: Is Sangeeta Bijlani upset with former husband Mohammad Azharuddin over the biopic?
, గురువారం, 12 మే 2016 (14:49 IST)
అజర్ సినిమాపై అజారుద్ధీన్ మాజీ భార్య సంగీత బిజ్లానీ టెన్షన్ పడుతుందట. ఈ సినిమాలో తన రోల్ నెగటివ్‌గా ఉంటుందా.. పాజిటివ్‌గా ఉంటుందా అనే దానిపై అమ్మడుకు బెంగ పట్టుకుంది. అజారుద్ధీన్ బయోపిక్ సినిమా మే 13న రిలీజ్ కానున్న నేపథ్యంలో.. మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాల్పడినందుకు మాజీ భార్య సంగీత బిజ్లానీతో అఫైరే కారణమని వార్తలొచ్చిన నేపథ్యంలో తన రోల్ గురించి నెగటివ్ షేడ్స్ ఈ మూవీలో ఉంటాయో ఏమోనని అమ్మడు భయపడుతుందట. 
 
2010కి తర్వాత అజారుద్ధీన్-సంగీత విడాకులతో వేరైన నేపథ్యంలో.. అజార్‌తో సంగీత అఫైర్ గురించి ఈ సినిమాలో చూపించనున్నట్లు ఇప్పటికే వదంతులు వచ్చాయి. 90టీస్‌లో వీరిద్దరి ప్రేమాయణం హాట్ టాపిక్ అయ్యింది. ఆపై వీరికి వివాహం కూడా జరిగింది. కానీ 2010లో వీరిద్దరూ నరీన్ (రెండో భార్య) రావడంతో విడాకులు తీసుకున్నారు. 
 
ఇకపోతే.. అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ఈ నెల 13వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో.. ప్రమోషన్ కార్యక్రమం నిమిత్తం చిత్ర బృందంతో పాటు అజారుద్దీన్ కుడా పాలు పంచుకుంటున్నాడు. అయితే.. సదరు మీడియా సమావేశాలలో తరచుగా "మ్యాచ్ ఫిక్సింగ్‌లో మీరు డబ్బు తీసుకున్నారా?" అనే ప్రశ్న ఎదురు అవుతుందట.
 
ఈ ప్రశ్నతో అజారుద్దీన్‌కి కోపం కట్టలు తెంచుకొని.. అక్కడి నుండి లేచి వెళ్ళిపోతున్నాడు. లాజిక్‌గా సమాధానం చెప్పి తప్పించుకోమని.. అలా వెళ్లవద్దని.. చిత్ర యూనిట్ ఆయనకు చెప్పినప్పటీకి అజర్ వినడంలేదట. 'ఈ సినిమా చూస్తే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది' అని చెప్పమని అజర్‌కు చిత్ర యూనిట్ చెప్పిందని తెలుస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్‌పై ప్రశ్న అడుగుతారేమోనని అనుమానంతో ఒక ప్రముఖ ఛానెల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక షోకి కుడా అజర్ హాజరుకాలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీని కసితీర్చుకున్న యువరాజ్.. సింగిల్ రన్‌తో అవుట్ చేసి?!