Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

5 వికెట్లతో సిరాజ్ రికార్డ్.. తల్లి మాటలు కసిని పెంచాయ్.. తండ్రి వుండి వుంటే..? (Video)

Advertiesment
5 వికెట్లతో సిరాజ్ రికార్డ్.. తల్లి మాటలు కసిని పెంచాయ్.. తండ్రి వుండి వుంటే..? (Video)
, సోమవారం, 18 జనవరి 2021 (19:36 IST)
Mohammed Siraj
టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై ప్రస్తుతం నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. తండ్రి మరణించినా ఆస్ట్రేలియా సిరీస్‌లో దేశం కోసం ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌తోనే సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ హైదరాబాద్ గల్లీ బాయ్.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తాజాగా బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి కెరీర్‌లో(5/73) అత్యుత్తమ గణంకాలను నమోదు చేశాడు.
 
సిరాజ్‌కు తోడుగా శార్దూల్ ఠాకూర్(4/61), వాషింగ్టన్ సుందర్(1/80) రాణించడంతో ఆసీస్ 294 పరుగులకే ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 328 పరుగుల లక్ష్యం నమోదైంది. అయితే జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లు లేకున్నా.. సిరాజ్ పేస్ విభాగాన్ని అద్భుతంగా నడిపించాడు. యువ బౌలర్లు శార్దుల్, సైనీతో కలిసి ఆసీస్‌ను కట్టడి చేశాడు. దాంతో ఈ యువ ఆటగాడిపై ప్రశంసల జల్లు కురుస్తుంది.
 
ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ.. 'నాన్న లేడని బాధపడకు బిడ్డ.. ఏదో ఒక రోజు అందరూ వెళ్లి పోవాల్సిందే. ఈ రోజు మీ నాన్న, రేపు నేనూ.. కానీ నాన్న కలను సాకారం చేయ్.'అని తన తల్లి ఫోన్‌లో అన్న మాటలు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. 
 
కాగా సిరాజ్‌ ఆసీస్‌ టూర్‌లో ఉన్న సమయంలోనే అతని తండ్రి మహమ్మద్‌ గౌస్‌ (53) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఇక తండ్రిని చివరిసారిగా చూడలేకపోయాననే బాధలో ఉన్న సిరాజ్‌కు తన తల్లి మాటలు కసిని పెంచాయని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తెలిపాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఐదు వికెట్లు తీయడం చాలా సంతోషంగా ఉందన్నాడు.  
 
టెస్ట్‌ల్లో భారత జట్టుకు ఆడటం మా నాన్న కోరిక. అది సాకరమయ్యేలా చేసిన ఆ దేవుడికి ధన్యవాదాలు. ఈ రోజు మా నాన్న గనుక ఉండి ఉంటే చాలా సంతోషించేవాడు. కానీ ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నాకుంటాయి.' అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. 
 
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు మహ్మద్‌ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌ చెలరేగడంతో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకొని టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో హైద‌రాబాదీ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ 5 వికెట్లు తీయ‌డం విశేషం. 
 
సీనియ‌ర్ బౌల‌ర్లు లేక‌పోయినా ఆ భారాన్ని త‌న భుజాల‌పై మోసిన సిరాజ్‌.. టెస్ట్ కెరీర్‌‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. శార్దూల్ కూడా 4 వికెట్ల‌తో రాణించాడు. అయితే, మన హైదరాబాదీ మహ్మద్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్, బుమ్రా, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కితాబిచ్చారు. ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత సినియర్ బౌలర్లు అందరూ గాయాలతో దూరం కావడంతో యువ పేసర్లు జట్టులోకి వచ్చారు. అయితే ఈ టెస్టు సిరీస్‌లో మహ్మద్‌ సిరాజ్‌ అంద్భుతంగా రాణిస్తుండటంతో అతను పెద్దోడైపోయాడు అని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
 
మహ్మద్‌ సిరాజ్ నెల రోజుల ముందు విమర్శలు ఎదుర్కొన్నాడు. రన్‌ మెషిన్‌ అంటూ దేశవ్యాప్తంగా ట్రోలింగ్‌కు గురైన సిరాజ్‌.. ఆసిస్‌ పర్యటనలో తన మ్యాజికల్‌ బౌలింగ్‌తో అందరి నోళ్లు మూయించాడు. సీనియర్ బౌలర్లంతా గాయపడి టీమ్‌కు దూరమైన వేళ.. ఆ భారాన్ని తన భుజాలపై మోసిన సిరాజ్‌.. టెస్ట్ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లతో సత్తా చాటాడు. గబ్బా టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆసిస్‌ వెన్నువిరిచాడు.
 
1994లో జననం:
1994లో జన్మించిన సిరాజ్.. మంచి పేస్‌, స్వింగ్‌ కలిగిన సిరాజ్‌.. HCA డివిజన్‌ లీగ్‌లో సత్తాచాటాడు. అక్కడి నుంచి హైదరాబాద్‌ అండర్‌-23 జట్టుకు ఎంపికైన సిరాజ్‌ వెనుదిరిగి చూడలేదు.
 
హైదరాబాద్ రంజీ ట్రోఫీ, ఐపీఎల్ :
అండర్‌-23 జట్టు తరఫున సత్తాచాటి హైదరాబాద్‌ రంజీ ట్రోఫీ జట్టుకు ఎంపికైన సిరాజ్‌.. కోచ్‌ భరత్‌ అరుణ్‌ దృష్టిలో పడ్డాడు. టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న భరత్‌.. 2016 హైదరాబాద్‌ రంజీ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. ఒకరకంగా టీమ్‌ ఇండియాకు సిరాజ్‌ ఎంపికలో భరత్‌దే కీలకపాత్ర… రంజీ ప్రదర్శనతో అందరి దృష్టిలో పడిన సిరాజ్‌కు ఐపీఎల్‌ రూపంలో జాక్‌పాట్‌ తగిలింది. 
 
2017లో జరిగిన వేలం పాటలో 23 ఏళ్ల సిరాజ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 2.6 కోట్ల రూపాయలకు దక్కించుకోవడం.. పెద్ద సంచలనమైంది. ఐపీఎల్‌ తర్వాత నేరుగా ఇండియా-ఎ జట్టుకు ఎంపికైన సిరాజ్‌ను కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరింత సానబెట్టాడు. సఫారీ పర్యటనలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన ఏకైక అనధికారిక టెస్టులో ఐదు వికెట్లు తీశాడు.
 
కొనాళ్ల పాటు సహజసిద్ధమైన స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్లకు ముప్పతిప్పలు పెట్టిన సిరాజ్‌ క్రమంగా ఫామ్‌ కోల్పోయాడు. ప్రస్తుతం ఆసీస్‌ పర్యటనలో రాటు తేలాడు. తిరిగి ఫామ్‌లోకి వచ్చి తన బంతి పవర్‌ ఏంటో చూపించాడు అందరి నోళ్లు ముయించాడు. టెస్ట్ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల తన ఖాతాలో వేసుకోని రికార్డు సృష్టించాడు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ISL Special: జంషెడ్‌పూర్‌పై నార్త్ ఈస్ట్ యునైటెడ్ విజయం