టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ ధోని ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకొనే న్యూస్‌ను బీసీసీఐ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియాకు మెంటర్‌గా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిని నియమిస్తూ బీసీసీఐ అధికారిక ట్వీట్ ద్వారా ప్రకటించది. దీంతో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ ఏర్పడింది.
యూఏఈ వేదికిగా అక్టోబర్ 17న టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. ఈ టోర్నమెంట్‌కు 15మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దానితోపాటు ఈ టోర్నమెంట్‌కు టీం ఇండియా మెంటర్‌గా మహేంద్రసింగ్ ధోనీని నియమించింది. ఈ జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహించనుండగా, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు.
టీ20 జట్టు వివరాలు
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్స్‌గా శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్ ఎంపికైనారు.