Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు భారత దిగ్గజ బౌలర్ గుడ్‌బై!!

ashwin

ఠాగూర్

, బుధవారం, 18 డిశెంబరు 2024 (12:12 IST)
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు భారత దిగ్గజ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో గాబ్బా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం అశ్విన్ ఈ ప్రకటన చేశారు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అశ్విన్ రిటైర్మెంట్‌ను బీసీసీఐ కూడా అధికారికంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. భారత క్రికెట్ జట్టులో ఆల్‌రౌండర్‌గా అద్భుతమైన క్రికెట్ సేవలను అశ్విన్ అందించారు. 
 
38 యేళ్ల అశ్విన్ 20211లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశారు. 2020లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వన్డే అరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో మొత్తం 105 టెస్టులు ఆడిన అశ్విన్ 3474 పరుగులు చేయగా, 536 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 6 సెంచరీలు, 14 అర్థ సెంచరీలు సాధించాడు. 
 
టెస్ట్ ఫార్మెట్‌లో 37 సార్లు ఐదు వికెట్లు నేల కూల్చిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన ఘనతను ఎనిమిది సార్లు దక్కించుకున్నాడు. అలాగే, 116 వన్డే మ్యాచ్‌లలో 707 పరుగులు చేయగా, 156 వికెట్లు తీశాడు. 65 టీ20 మ్యాచ్‌లలో 72 వికెట్లు తీసి, పొట్టి ఫార్మెట్‌లో 154 పరుగులు చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమిండియా చెత్త ప్రదర్శనపై ట్రోల్స్.. తనకు సంబంధం లేదన్న అనిల్ కుంబ్లే!!