Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంబటి రాయుడు యూటర్న్ తీసుకున్నాడు.. భావోద్వేగంలో అలా జరిగిపోయింది..

Advertiesment
అంబటి రాయుడు యూటర్న్ తీసుకున్నాడు.. భావోద్వేగంలో అలా జరిగిపోయింది..
, శుక్రవారం, 30 ఆగస్టు 2019 (17:21 IST)
స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు మనసు మార్చుకున్నాడు. అనుకున్నట్లే రాయుడు గురువారం తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఇంకా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నానని తెలిపింది. ఇకపై అన్ని ఫార్మాట్లో క్రికెట్ ఆడాలని అనుకుంటున్నానని చెప్పాడు. 
 
గడ్డుకాలంలో తనకు మద్దతుగా నిలిచి, తనలో ఇంకా క్రికెట్‌ మిగిలి ఉందని చెప్పిన సీఎస్‌కే యాజమాన్యం, వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌లకు ధన్యవాదాలని  బీసీసీఐ, హెచ్‌సీఏకు పంపిన లేఖలో రాయుడు పేర్కొన్నాడు. భావోద్వేగంలో రిటైర్మెంట్ ప్రకటించానని.. ఆ సమయంలో చాలా బాధపడ్డానని.. అందరూ తనతో మాట్లాడటంతో తిరిగి ఆలోచించానని చెప్పుకొచ్చాడు.
 
హైదరాబాద్‌ తరపున తిరిగి ఆడేందుకు ఏంటో ఉత్సాహంగా ఉన్నా. హైదరాబాద్‌ జట్టు పూర్తిస్థాయిలో సత్తా చాటేందుకు నా సహకారం అందిస్తా. వచ్చే నెల 10 నుంచి జట్టుతో చేరేందుకు సిద్ధమని రాయుడు ప్రకటించాడు. ఇంకా 'రాయుడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. హెచ్‌సీఏ తరపున ప్రాతినిథ్యం వహించేందుకు అతడు అందుబాటులో ఉంటాడు' అని హెచ్‌సీఏ కూడా తెలిపాడు. 
 
2013లో జింబాబ్వేతో జరిగిన వన్డేతో రాయుడు భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది రాంచీలో ఆస్ట్రేలియాపై చివరి వన్డే ఆడాడు. 55 వన్డేల్లో 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 124 నాటౌట్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు(Video)