Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలీసా హీలీ డ్రాప్ చేసిన ఆ క్యాచ్.. భారత్‌కు అద్భుత క్షణం.. ఫ్యాన్స్ హ్యాపీ.. జెమియాకి జై జై (వీడియో)

Advertiesment
Alyssa Healy

సెల్వి

, శుక్రవారం, 31 అక్టోబరు 2025 (13:04 IST)
Alyssa Healy
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను జెమియా తన భుజస్కంధాలపై వేసుకుంది. అన్నీ తానై ఈ మ్యాచ్‌ను గెలిపించింది. తద్వారా ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరింది. జెమీమా రోడ్రిగ్స్ అజేయ సెంచరీతో జట్టు గెలుపు తీరాలకు చేరింది.
 
నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్ హీరో మాత్రం జెమీమానే. 134 బంతుల్లో 14 ఫోర్లతో అజేయంగా 127 పరుగులు చేసింది జెమీమా. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో నిలిచి విజయాన్ని అందించింది. 
 
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 89 పరుగులతో ఆకట్టుకుంది. జెమీమా, హర్మన్ ప్రీత్ మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జెమీమా రోడ్రిగ్స్, ఆల్ టైమ్ క్లాసిక్ వన్డే ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో ఒకటి అనదగిన ఆటతీరును ప్రదర్శించింది. 
 
అమన్‌జోత్ కౌర్ విన్నింగ్ బౌండరీ కొట్టగానే క్రీజులో కూలబడిన రోడ్రిగ్స్, దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది. మహిళల వన్డే చరిత్రలో రికార్డు ఛేదనలో (339 పరుగులు) ఆమె పోరాటాన్ని ఆస్వాదించారు. 
 
ఈ వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు ఏడ్చానని, ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోలేదని, యాంగ్జైటీతో బాధపడ్డానని మ్యాచ్ అనంతరం జెమీమా వెల్లడించింది. అలిస్సా హీలీ ప్రపంచ కప్‌ను కోల్పోయిన క్షణం.. బంతిని వదిలిన క్షణం.. భారత్‌కు కలిసొచ్చింది. 
 
అయితే, మ్యాచ్ రసవత్తర సమయంలో జెమీమా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ డ్రాప్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ క్యాచ్ పట్టుంటే ఫలితం మరోలా ఉండేది.
 
అయితే, అభిమానులు ఊపిరి బిగపట్టిన ఆ క్షణంలో, బంతి ఆమె గ్లౌజ్‌ల నుంచి జారిపడిన బంతిని చూసి మైదానంలో పండగ వాతావరణం నెలకొంది. 
 
హీలీ వదిలేసిన ఆ క్యాచ్‌తో భారత జట్టుకు కొత్త ఊపిరి లభించింది. ఈ మ్యాచ్‌లో ఈ క్షణం హైలైట్‌గా నిలిచింది. ఈ అద్భుతమైన క్షణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Jemimah Rodrigues: మహిళల వన్డే ప్రపంచకప్ 2025‌.. జెర్మియా, హర్మన్‌ప్రీత్ అదుర్స్.. జీసస్ వల్లే? (video)