Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీ20 ప్రపంచకప్‌: సూపర్ 12లోకి అడుగుపెట్టిన బంగ్లాదేశ్-షకీబ్‌ అదుర్స్

టీ20 ప్రపంచకప్‌: సూపర్ 12లోకి అడుగుపెట్టిన బంగ్లాదేశ్-షకీబ్‌ అదుర్స్
, గురువారం, 21 అక్టోబరు 2021 (21:29 IST)
టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ముందడుగు వేసింది. ఎట్టకేలకు గ్రూప్ స్టేజీ నుంచి సూపర్ 12లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో పసికూన పపువా న్యూగునియాపై 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సూపర్ 12లోకి వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు సత్తా చాటారు. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మహ్మద్ నయీమ్ డకౌట్ అయినా షకీబ్ (46), లిటన్ దాస్ (29), కెప్టెన్ మహ్మదుల్లా (50) చెలరేగి ఆడారు. దీంతో నిర్ణీత ఓవర్లలో బంగ్లాదేశ్ 181/7 భారీ స్కోరు సాధించింది.
 
అనంతరం 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోగి దిగిన పపువా న్యూగినియాను 97 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ చేసింది. షకీబ్ బౌలింగ్‌లో కూడా సత్తా చాటి నాలుగు వికెట్లు తీసి పపువా న్యూగినియా నడ్డి విరిచాడు. షకీబ్ నాలుగు ఓవర్లు వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 
 
అతడికి సైఫుద్దీన్ (2 వికెట్లు), టస్కీన్ అహ్మద్ (2 వికెట్లు), మెహేదీ హసన్ మిరాజ్ (1 వికెట్) సహకరించారు. వికెట్ కీపన్ డోరిగా (46 నాటౌట్), సోపర్ (11) తప్ప మరెవ్వరూ రాణించలేదు. కాగా ఈనెల 23న టీ20 ప్రపంచకప్‌లో ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
 
షకీబ్‌ అల్‌ హసన్‌ అదుర్స్
బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ తానెంత గొప్ప ఆల్‌రౌండర్‌ అనేది మరోసారి చూపించాడు. టి20 ప్రపంచకప్‌ 2021లో పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్‌-బి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో షకీబ్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. ముందుగా బ్యాటింగ్‌లో బంగ్లాదేశ్‌ భారీ స్కోరు చేయడంలో షకీబ్‌ కీలకపాత్ర పోషించాడు. 37 బంతుల్లో 47 పరుగులు చేసిన షకీబ్‌ ఇన్నింగ్స్‌లో 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఇరగదీశాడు. (4-0-9-4) ఇవీ షకీబ్‌ గణాంకాలు. 
 
పసికూన పపువాపై విజయం సాధించినప్పటికి.. సూపర్‌ 12కు అర్హత సాధించాలంటే బంగ్లాకు భారీ విజయం అవసరం ఉంది. అందుకే సరైన సమయంలో షకీబ్‌ తనలోని ఆల్‌రౌండర్‌ను నిద్రలేపాడు. ప్రస్తుతం షకీబ్‌ ఐసీసీ టి20 ఆల్‌రౌండర్స్‌ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. 
 
ఇక షకీబ్‌ ప్రదర్శనపై సోషల్‌ మీడియాలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ''వారెవ్వా ఇలాంటి ఆల్‌రౌండర్‌ ఒక్కడున్నా చాలు.. ఒంటిచేత్తో బంగ్లాను సూపర్‌ 12 దశకు చేర్చాడు... షకీబ్‌ నిజంగా గ్రేట్‌.. నెంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ అనే పదానికి సరైన నిర్వచనం షకీబ్‌ అల్‌ హసన్‌'' అంటూ కామెంట్స్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టచ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ : టీ20 వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తు