Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ ప్రేయసితో శృంగారం.. వీడియో లీక్.. సనత్ జయసూర్యకు తంటాలు..

అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక మాజీ కెప్టెన్.. జయసూర్య వీడ్కోలు పలికిన తర్వాత శ్రీలంక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్లకు చుక్కలు చూపించిన సనత్ జయసూర్య ప్రస్తుతం చిక్కుల్లో చిక్

Advertiesment
మాజీ ప్రేయసితో శృంగారం.. వీడియో లీక్.. సనత్ జయసూర్యకు తంటాలు..
, శనివారం, 27 మే 2017 (10:14 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక మాజీ కెప్టెన్.. జయసూర్య వీడ్కోలు పలికిన తర్వాత శ్రీలంక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్లకు చుక్కలు చూపించిన సనత్ జయసూర్య ప్రస్తుతం చిక్కుల్లో చిక్కుకున్నాడు. తన మాజీ ప్రేయసితో అతడు సన్నిహితంగా ఉన్న శృంగార వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మాజీ ప్రేయసితో సనత్ జయసూర్య శృంగారం జరుపుతున్న వీడియో లీక్ కావడంతో ప్రస్తుతం అతడు దోషిగా మారిపోయాడు. 
 
ఈ వీడియో వ్యవహారంపై శ్రీలంకకు చెందిన సైబర్ భద్రతా విభాగం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో అతనితో కలిసి శృంగారంలో పాల్గొన్న మహిళ ప్రస్తుతం లంకలోని ప్రఖ్యాత వ్యాపారవేత్త, మీడియా టైకూన్ సతీమణి కావడంతో.. సనత్ జయసూర్యకు ఇబ్బందులు తప్పవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో జయసూర్య శృంగార వీడియో హల్‌చల్ చేయడంతో జయసూర్య మాజీ ప్రేయసి షాక్‌కు గురైంది. 
 
ఈ వీడియో వైరల్‌ కావడంపై ఆమె కొలంబోలోని శ్రీలంక జాతీయ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌లో ఫిర్యాదు చేసింది. తనపై ప్రతీకారంతోనే జయసూర్య ఆ విధంగా చేశాడని ఆమె తన స్నేహితులవద్ద వాపోయింది. శుక్రవారం ఈ వీడియోను చాలామంది చూసేశారని సైబర్ సెక్యూరిటీ సెంటర్లో వెల్లడించింది. ఈ విషయమై జయసూర్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, అతడు అందుబాటులోకి రాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌లో కళతప్పిన కోహ్లీ ఇప్పుడు దెబ్బతిన్న పులి.. తేలిగ్గా చూశారో అంతే అంటున్న హస్సీ