Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్‌లో కళతప్పిన కోహ్లీ ఇప్పుడు దెబ్బతిన్న పులి...

ఐపీఎల్ 10 సీజన్‌లో అంచనాలకు తగిన ఆట ప్రదర్శించలేకపోయిన టీమిండియా కేప్టెన్ ఇప్పుడు దెబ్బతిన్న పులి అని, ఏమాత్రం అతడిని తక్కువగా అంచనా వేస్తే ఊచకోత ఖాయమని ఆసీస్‌ మాజీ సారథి మైక్‌ హస్సీ హెచ్చరించాడు. ఐపీ

ఐపీఎల్‌లో కళతప్పిన కోహ్లీ ఇప్పుడు దెబ్బతిన్న పులి...
హైదరాబాద్ , శనివారం, 27 మే 2017 (05:59 IST)
ఐపీఎల్ 10 సీజన్‌లో అంచనాలకు తగిన ఆట ప్రదర్శించలేకపోయిన టీమిండియా కేప్టెన్ ఇప్పుడు దెబ్బతిన్న పులి అని, ఏమాత్రం అతడిని తక్కువగా అంచనా వేస్తే ఊచకోత ఖాయమని ఆసీస్‌ మాజీ సారథి మైక్‌ హస్సీ హెచ్చరించాడు. ఐపీఎల్‌లో ఫామ్‌ ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీలో భారత కెప్టెన్ కోహ్లీని తక్కువ అంచనా వేస్తే ప్రత్యర్థి జట్లు కంగుతినక తప్పదని చెప్పాడు. లండన్‌లో జరిగిన ఐసీసీ కార్యక్రమంలో పాల్గొన్న మైక్ హస్సీ మేటి ఆటగాడు సుదీర్ఘ కాలం ఫామ్ లేమిని ఎదుర్కొలేడు కాబట్టి కోహ్లీ విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని ఆసీస్ జట్టును హెచ్చరించాడు. జూన్ లో ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో కోహ్లీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే   కంగుతినడం ప్రత్యర్ధి జట్ల వంతు అవుతుందన్నాడు. అలా చేస్తే ఎవరి గోతిని వారే తీసుకున్నట్లేనని హితవు పలికాడు.
 
విరాట్ కోహ్లీ సొగసైన ఆటగాడు. ఎవరైనా అతడిని లైట్‌గా తీసుకుంటే చేదు అనుభవం ఎదురుకాక తప్పదు. మేటి ఆటగాడు సుదీర్ఘకాలం ఫామ్‌లేమిని ఎదుర్కోడు. ఇంగ్లండ్‌లో అతడు పట్టుదలగా ఆడి తాను ప్రపంచ స్థాయి ఆటగాడినని నిరూపించుకుంటాడు’ అని శుక్రవారం ఐసీసీ కార్యక్రమం సందర్భంగా హస్సీ స్పష్టంజేశాడు. అసలు కోహ్లీ ఫామ్‌ డిఫెండింగ్‌ చాంపియన్ భారత్ అవకాశాలపై ఎలాంటి ప్రభావమూ చూపదని అభిప్రాయపడ్డాడు.
 
ఆస్ర్టేలియాలో మాదిరి బంతులు దూసుకురావని, అందువల్ల బంతి వచ్చేవరకూ ఎదురు చూసి ఆడడం ఇంగ్లండ్‌లో ముఖ్యమని పేర్కొన్నాడు. బర్మింగ్‌హామ్‌, కార్డిఫ్‌, ఓవల్‌ పిచ్‌లు స్పిన్నర్లకు కొంత అనుకూలిస్తాయని హసీ అంచనా వేస్తున్నాడు. స్టీవ్‌ స్మిత్ సేనకు ట్రోఫీ గెలిచే అవకాశాలున్నాయన్నాడు. స్మిత్, ఐపీఎల్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ విజేత వార్నర్‌ అద్భుత ఫామ్‌లో ఉండడం ఆసీస్‌కు లాభిస్తుందని తెలిపాడు. చాంపియన్స ట్రోఫీ ఫైనల్‌‌ని ఆసీస్-ఇంగ్లండ్‌ల వన్డేల యాషెస్‌ యుద్ధంగా అంచనావేస్తున్న హసీ...భారత-ఆసీస్‌ మధ్య కూడా తుది సమరం జరిగే అవకాశాలూ లేకపోలేదన్నాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ దేవుడి ప్రసాదాన్ని అందుకోలేకపోయాను.. వీరేంద్ర సెహ్వాగ్ వీరభక్తి