కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తామంటూ వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వస్తున్నాయని టీఆర్అండ్ బి స్పెషల్ సెక్రెటరీ, కొవిడ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్రంలోని కోవిడ్ బాధితులకు 20 రోజుల్లో రూ. 17 కోట్ల మేర పలు ప్రముఖ సంస్థలు, వ్యక్తులు సాయం అందించారని ఆయన చెప్పారు.
ఇప్పటి వరకు వివిధ సంస్థలు, ట్రస్టులు, సొసైటీలు, దాతలతోపాటు విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, పిఎస్‌యులను సంప్రదించడం జరిగిందని.. మరో 18 కోట్ల రూపాయల విలువైన సాయం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మన దేశంలోని వివిధ సంస్థలు కోవిడ్19 పై పోరాడడం కోసం ఔషధాల రూపంలో గానీ, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సర్జికల్ మాస్కులు, రెస్పేరేటర్లు, మందుల పరికరాలు అందించేందుకు ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు.
కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా సాయం అందిస్తున్న సంస్థలు, వ్యక్తుల దాతృత్వం ప్రశంశనీయమని అర్జా శ్రీకాంత్ అన్నారు. ముఖ్యంగా ప్రాంతీయ, గ్రామీణ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన మేరకు సాయమందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు ముందుకొస్తున్నాయని.. రూ. 1.5 కోట్ల విలువైన ముఖ్యమైన మందులను బయోఫొర్, లుపిన్, ఇండియా బుల్స్ సంస్థలందించాయని అర్జా శ్రీకాంత్ తెలిపారు.
రెండో విడత సాయం కింద నిర్మాణ్ ఆర్గనైజేషన్ 13×10 ఐసియు బెడ్లు చొప్పున ప్రతి జిల్లాలోని ఏరియా ఆసుపత్రికి సమకూర్చుతోందనీ తెలిపారు. మొదటి విడతగా 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్ ను ఆరు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులలో యాక్ట్ ఫౌండేషన్ నెలకొల్పిందనీ, రెండో విడతలో మిగతావి నెలకొల్పనుందన్నారు.
మొబైల్ హాస్పిటల్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు మాస్టర్ కార్డ్, మాడ్యులస్ హౌసింగ్ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పనతోపాటు పడకలను అందించేందుకు ఎన్టీపీసీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. దాదాపు 12 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 184 ఆక్సీ సిలెండర్లూ ఇంతవరకూ అందాయనీ, మరో వెయ్యికి పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించనున్నారనీ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.
ఇప్పటి వరకు అందించిన సాయం వివరాలు:
• లుపిన్ లిమిటెడ్ రూ. 5లక్షల విలువైన డెక్సామెథసోన్ 4ఎంజి 15లక్షల ట్యాబ్లెట్లు ప్రభుత్వానికి అందించింది.
• ఫ్లెక్స్ చెన్నై వారు రూ. 100 లక్షల విలువైన 50లీటర్ల ఆక్సిజన్ ట్యాంకర్లు 60, 4లీటర్ల ఆక్సిజన్ ట్యాంకర్లు 70, 10లీటర్ల స్టీల్ సిలిండర్లు 170 చొప్పున గుంటూరు సెంట్రల్ డ్రగ్ సెంటర్ లో అందజేశారు.
• ఖల్సా ఎయిడ్ ఇండియా ఛారిటబుల్ ట్రస్ట్ రూ. 13 లక్షల విలువైన 25 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 10 స్టెబిలైజర్లు అందించారు. ఇవి పశ్చిమగోదావరి జిల్లాలో వినియోగించుకోవాలని కోరారు.
• డాక్టర్ నాగేశ్వర్ బండ్ల రూ.5లక్షల విలువైన 10 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను చిత్తూరు సంకల్ప్ హాస్పటల్ కు అందించారు.
• ఆదిత్య బిర్లా రూ. 17.5లక్షల విలువైన 35 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను గుంటూరు సెంట్రల్ మెడికల్ స్టోర్లో అందజేశారు.
• యాక్ట్ పౌండేషన్ రూ. 12 లక్షల విలువలైన 24 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లలో ఏలూరు డిస్ట్రిక్ట్ హాస్పటల్ కు- 9, గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ స్కూల్ & హాస్పటల్ (శ్రీకాకుళం)-10, ఆశ్రమ్ హాస్పటల్స్-5 అంజేశారు.
• సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ రూ. 18.5లక్షల విలువైన 37 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను విశాఖపట్నం, అనంతపురం ఆస్పత్రులకు అందజేశారు.
• శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ రూ. 3లక్షల విలువైన 25వేల సర్జికల్ మాస్కులను తూర్పుగోదావరి జిల్లాకు అందజేశారు.
• రూరల్ హోప్ ఫౌండేషన్ యుఎస్ఎ & విజిఆర్ డయాబిటీస్ ఎడ్యుకేషన్ రూ.7 లక్షల విలువైన 80 ఆక్సిజన్ ఫ్లో మీటర్స్, 25వేల సర్జికల్ మాస్కులు, 2600 ఎన్-95 మాస్కులు, 10వేల గ్లౌజులు, 6 ట్రాలీ స్ట్రెచెర్స్ ను కృష్ణా జిల్లాకు అందించారు.
• ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రూ. 7లక్షల విలువైన వెయ్యి మెడికల్ కిట్లు విజయవాడ జిజిహెచ్ కు ఇవ్వడం జరిగింది.
• నాట్కో ట్రస్ట్ రూ. 1.51 లక్షల విలువైన బారిసిటినిబ్ ట్యాబ్లెట్లు-3800 సెంట్రల్ మెడికల్ స్టోర్స్ లో అందించారు.
• డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారు రూ. 40లక్షల విలువైన మందులను సెంట్రల్ మెడికల్ స్టోర్స్ లో అందజేశారు.
• వెస్ట్ ఫీల్డ్ సౌత్ ఏసియన్ కమిటీ రూ. 10 లక్షల విలువైన 85 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 9018 నాజల్ కానులా 4000, పల్స్ ఆక్సీమీటర్లు 100 చొప్పున కడప జిల్లాకు అందజేశారు.
• మాస్కాన్ కోఆపరేషన్ రూ.80లక్షల విలువైన 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 80 మెట్రిక్ టన్నుల మోల్సివ్ యాడ్సోర్బెంట్ 13 ఎక్స్.హెచ్.బి, 1957 నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ మాస్కులు కృష్ణా జిల్లాకు అందించారు.
• కార్పెడ్ (ఇ&వై) చీరాలలో జర్మన్ హ్యాంగర్ ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది.
• ఎంఎస్ ఆర్చ్ ల్యాబ్స్ రూ. 2.5 లక్షల విలువైన 5 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కృష్ణా జిల్లాకు ఇచ్చారు.
• ఐటిసి సంస్థ రూ. 1.2 కోట్ల విలువైన పీఎస్ఏ జనరేటర్లను గుంటూరు జిల్లాకు అందజేసింది.
• ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ సీఈవో శ్రీ ప్రేమ్ కుమార్ రెడ్డి రూ. 38.5 లక్షల విలువైన 77 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు గుంటూరు జిల్లాకు అందించారు.
• యునైటెడ్ మెమోరియల్ మెడికల్ సెంటర్ వారు రూ. 1.8 కోట్ల విలువైన 280 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 3000 ఆక్సీమీటర్లను కర్నూలు జిల్ల ప్రభుత్వాసుపత్రులకు ఇవ్వడం జరిగింది.
• యాక్ట్ & స్వాస్థ్ రూ.3.42 కోట్ల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు, బీఐపాప్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రులకు అందజేశారు.
• హెల్త్ సైన్సెస్ నార్త్ హాస్పటల్ రూ. 77 లక్షల విలువైన మాస్కులు, గ్లౌజులు డొనేట్ చేశారు.
• కెనడాలోని ఏపీఎన్నార్టీఎస్ కోఆర్డినేటర్లు రూ. 3లక్షల విలువైన పల్స్ ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ ఫ్లో మీటర్లు డొనేట్ చేశారు.
• సింగపూర్ లోని ఏపీఎన్నార్టీఎస్ కోఆర్డినేటర్లు రూ. 1.65 లక్షల విలువైన డిస్పోజబుల్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు డొనేట్ చేశారు.
• ఎన్వీ సుభాష్ రెడ్డి, ఈ. శివానందరరెడ్డి రూ. 77వేల విలువైన పల్స్ ఆక్సీమీటర్లు అందించారు.
ఇప్పటి వరకు అందిన సాయం వివరాలు మొత్తం:
• రూ. 1.2 కోట్ల విలువైన వివిధ రకాల మందులు మరియు రూ. 15.65 కోట్ల విలువైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ఐసియు బెడ్లు, మాస్కులు తదితర మెడికల్ ఎక్విప్మెంట్లు అందాయి. (మొత్తం రూ. 17 కోట్లు)
సహాయం అందించేందుకు సిద్ధంగా వారి వివరాలు:
• లిండే ఇండియా లిమిటెడ్ రూ. 10లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అనంతపురం జిల్లాకు ఇవ్వడానికి అంగీకరించింది.
• మన తెలుగు అసోసియేషన్ ఇ.వి జర్మనీ (మాటా) రూ. 2.5 లక్షల విలువైన 5 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు.
• గ్రీన్ ప్యానల్ వారు రూ. 12.5 లక్షల విలువైన 25 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అనంతపురం జిల్లాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
• శ్వాస్థ్ డిజిటల్ హెల్త్ ఫౌండేషన్, యాక్ట్ సంస్థలు సంయుక్తంగా రూ. 50లక్షల విలువైన 1000 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను రాష్ట్ర వ్యాప్తంగా అందజేయనున్నారు.
• ఆదిత్య బిర్లా రూ. 50లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, పీఎస్ఐ ప్లాంట్లు ఇవ్వనుంది.
• ఎంఈఐఎల్ సంస్థ రూ. 4లక్షల విలువైన 200 పల్స్ ఆక్సీ మీటర్లు, 10000వేల మాస్కులు.
• డెమోక్రసీ పీపుల్ ఆర్గనైజేషన్ వు రూ. 1కోటి విలువైన 25 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను 13 జిల్లాల్లో అందించనున్నారు.
• 1998 బ్యాచ్ వాసవి కాలేజీ అల్యుమ్ని రూ. 70లక్షల విలువైన 2 ఆక్సిజన్ ప్లాంట్లు 350 ఎల్పీఎం కెపాసిటీవి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు.
• హెచ్ యుఎల్ సంస్థ రూ. 1 కోటి విలువైన 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు.
• యు.ఎస్.ఐ.ఎస్.పి వారు రూ. 2 కోట్ల విలువైన 400 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు.
• తానా యుఎస్ఎ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని కొల్లావారిపాలెంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
• మోడ్యుల్స్ హౌసింగ్ సొల్యూషన్స్ వారు తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని రెండు గిరిజన ప్రాంతాల్లో మొబైల్ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నారు.
• ఆనంద్ మోహన్ భగవతుల రూ. 3.6 లక్షలు గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామానికి ఇవ్వనున్నారు.
• హర్సీష్ వారు రూ. 17.5లక్షల 25 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు గుంటూరు జిల్లాకు ఇవ్వనున్నారు.
• ఎస్.సి.ఐ.ఎం.ఎ రూ. 1కోటి విలువైన 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాకు అందించనున్నారు.
• డల్టా ఫౌండేషన్ రూ. 6లక్షల విలువైన 4000 రెడీ టు ఈట్ ఫుడ్ ప్యాకెట్లను రాష్ట్రంలోని వివిధ కోవిడ్ కేర్ సెంటర్లకు అందించనున్నారు.
• ఎన్టీపీసీ వారు రూ. 1 కోటి విలువైన హాస్పటల్ బెడ్లు, ఫర్సీచర్ అందించనున్నారు.
• యునిసెఫ్ సంస్థ రూ. 1.2 కోట్ల విలువైన 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఇవ్వడానికి అందించింది.
• డియాజియో రూ. 50లక్షల విలువైన 1 పీఎస్ఏ ప్లాంట్ ను ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనుంది.
• ప్రేమాస్ లైఫ్ సైన్సెస్ వారు 2 ఆటోమేటెడ్ ఆర్ఎన్ఎ ఎక్ట్రాక్షన్ యూనిట్లను కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
• ఐసాయి ఫార్మా విశాఖపట్నంలో 2 ఆక్సిజన్ థియేటర్లు సాయం చేయనున్నారు.
• మాస్టర్ కార్డ్ వారు ప్రకాశం జిల్లాలో పోర్టబుల్ హాస్పటల్ యూనిట్లను అందించనున్నారు.
ప్రతిపాదనల్లో ఉన్న సాయం వివరాలు:
దాదాపు రూ. 18 కోట్ల రూపాయల విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్ సహాయంగా అందించడానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలు:
1. గత 20 రోజుల్లో రూ. 17 కోట్ల విలువైన కోవిడ్ సంబంధిత మందులు సహాయంగా అందించారు. రూ.18 కోట్ల సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నారు.
2. నిర్మాణ్ సంస్థ 13x10 చొప్పున 10 బెడ్లతో కూడిన ఒక్కో ఐసీయూ యూనిట్ ను ప్రతిజిల్లాలో ఒక్కో ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయనుంది. రెండో విడతనూ ఇదే తరహా లో మరో 13 ఐసీయూ బెడ్లు అందించబోతోంది.
3. యాక్ట్ ఫౌండేషన్ మొదటి విడతగా 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్లను 6 జిల్లా ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనుంది. రెండో విడతలో మిగిలినవి రెండ్ విడతలో పూర్తి చేయనుంది.
4. మాస్టర్ కార్డు, మాడ్యులస్ హౌసింగ్ మొబైల్ హాస్పటల్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.
5. ఎన్టీపీసీ సంస్థ 1 కోటి రూపాయలతో ఆస్పత్రులకు అవసరమైన బెడ్లు, ఇతర మౌళికసదుపాయాలు సమకూర్చనుంది.
6. ఇప్పటి వరకు 1200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను, 184 ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. వెయ్యికిపైగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.