కరోనా స్ట్రెయిన్‌పై అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి రిపోర్టులు చేరుతున్నాయి. కొత్త స్ట్రెయిన్ గురించి వైద్యాధికారులు ఎవరూ మాట్లాడొద్దని కేంద్రం ఆదేశాలిచ్చింది. మంగళవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయనుంది. కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ వచ్చినా టెన్షన్ పడొద్దని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా స్ట్రెయిన్ వైరస్ కలకలం సృష్టిస్తోంది.
యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. అయితే వీరిలో ఎంతమందికి కరోనా స్ట్రెయిన్ ఉందనేది సస్పెన్స్‌గా ఉంది. 20మంది శాంపిల్స్ జీన్ మ్యాప్ రిపోర్టులను సీసీఎంబీ కేంద్రానికి పంపింది. అలాగే తెలంగాణ అధికారులకు సమాచారం అందించింది.