Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్, ఎలాంటి మాస్కు వాడాలి? అది ఎంతవరకు ప్రయోజనకరం?

Advertiesment
కరోనావైరస్, ఎలాంటి మాస్కు వాడాలి? అది ఎంతవరకు ప్రయోజనకరం?
, శుక్రవారం, 10 జులై 2020 (21:05 IST)
లాక్ డౌన్ ప్రజల్లో అధికులు పక్కాగా పాటించని పరిస్థితి కనబడుతోంది. దీర్ఘకాలం లాక్ డౌన్ వల్ల అటు ఆర్థిక పరిస్థితి కుదేలవుతోంది. ఇప్పటికే కొందరు ఆర్థిక పరిస్థితి దారుణంగా మారడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులు దృష్టా ప్రభుత్వాలు కూడా దశలవారీగా లాక్ డౌన్ సడలిస్తున్నాయి. దీనితో మళ్లీ కరోనావైరస్ వ్యాప్తి రాకెట్ మాదిరిగా దూసుకుపోతుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కు, భౌతిక దూరం తప్పక పాటించాలి.
 
ఐతే ఏదో షాపులో దొరుకుతుంది కదా అని ఏది బడితే అది వాడితో కరోనా బారి నుంచి రక్షించబడటం సాధ్యం కాదని వైద్యులు అంటున్నారు. పరిశుభ్రత, సామాజిక దూరం, మాస్కులు కరోనా ప్రమాదాన్ని తొలగించవు, కానీ అవి గణనీయంగా తగ్గించగలవు. లాక్డౌన్ వారాలు, నెలల పాటు అనుభవించినవారిలో చాలామంది ఇతరుల నుండి తమ దూరాన్ని ఉంచడానికి ఆసక్తి చూపడంలేదు.
 
ఇప్పుడు రెస్టారెంట్లు, బార్‌లు తిరిగి తెరిచారు. చాలామంది మాస్కులను ముక్కు నుంచి తొలగించి నోటికి వేసుకుంటూ కనబడుతున్నారు. మరికొందరు ముక్కు, నోరు రెండూ వదిలేసి గడ్డానికి తగిలించుకుని తిరుగుతున్నారు. ఇలాంటివారి పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. ఫేస్ మాస్క్‌లు లాలాజలం యొక్క వైరస్ నిండిన కణాలను గాలిలో వ్యాపించకుండా, ఇతర వ్యక్తులకు సోకకుండా నిరోధించగలవు.
 
ఫేస్ మాస్క్‌లు ధరించినవారికి సంక్రమణ ప్రమాదాన్ని 65% తగ్గించాయని కొత్త డేటా సూచిస్తుంది, ఇది చాలా ముఖ్యమైనది. అంతేతప్ప అది పూర్తిగా నిరోధిస్తుందని వెల్లడికాలేదు. వైద్య నిపుణులు ధరించే N95 మాస్కులు మరింత రక్షణను అందిస్తాయి. ఈ మాస్కులు ప్రసార ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. కానీ ఇవి తక్కువ సరఫరా అవుతున్నాయి.
 
సామాజిక దూరం వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని 90% తగ్గిస్తుంది. మాస్కులు ధరించడం వల్ల ప్రమాదం 65% తగ్గుతుంది. కరోనావైరస్‌లు మానవ జుట్టు యొక్క మూడింట ఒక వంతు పరిమాణంలో వుంటాయి. మాస్కులు వాటిని నిరోధించడంలో ప్రభావవంతంగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఐతే ఏరోసోల్ కణాలు చాలా చిన్నవి, మానవ జుట్టు యొక్క పరిమాణంలో 1/100 వ స్థానంలో ఉంటాయి. అవి గాలిలో ఎక్కువసేపు వుండగలవు.
 
ఈ కణాలు మాస్కులు, ముఖ్యంగా ఇంట్లో తయారుచేసే మాస్కులు వాటిని నిరోధించలేవు. కనుక రెస్టారెంట్లు, దుకాణాలు, బార్లు ఇతర చోట్లకి వెళ్లినప్పుడు వీలయినంత ఎక్కువగా భౌతిక దూరం పాటించాలి. లేదంటే కరోనా ప్రమాదం పొంచి వున్నట్లే అని చెపుతున్నారు వైద్యులు. అలాగే నాణ్యమైన మాస్కులను ధరించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంగారకుడిపై సూపర్ టెక్నాలజీ.. అంతేకాదు.. దేవుడి విగ్రహం కూడా..?