Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీనేజ్ పిల్లలకు మొదటి వ్యాక్సినేషన్‌ షాట్‌ కోసం తల్లిదండ్రులు ఇనార్బిట్‌ హైదరాబాద్‌ను సంప్రదించవచ్చు

టీనేజ్ పిల్లలకు మొదటి వ్యాక్సినేషన్‌ షాట్‌ కోసం తల్లిదండ్రులు ఇనార్బిట్‌ హైదరాబాద్‌ను సంప్రదించవచ్చు
, బుధవారం, 19 జనవరి 2022 (15:47 IST)
హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు తమ 15-18 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులను తీసుకుని ఇనార్బిట్‌ మాల్‌ను సందర్శించడం మాత్రమే కాదు వారికి కోవిడ్‌ 19కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ తొలి మోతాదును పూర్తి ఉచితంగానూ అందించవచ్చు.


హైదరాబాద్‌లోని ఓ సుప్రసిద్ధ హాస్పిటల్‌తో ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ వ్యాక్సినేషన్‌లను మాల్‌లో అందించనుంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగనుంది.

 
‘‘ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ వద్ద, వీలైనన్ని మార్గాలలో మా వినియోగదారులకు సంతోషంగా సేవలనందించాలని కోరుకుంటుంటాము. తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవడంతో పాటుగా సురక్షితమైన, ఆరోగ్యవంతమైన, స్వచ్ఛమైన వాతావరణం కలిగిన ఇనార్బిట్‌ వద్ద తమ పిల్లలకు టీకాలను అందించడం  అదీ పూర్తి ఉచితంగా అందించడం చేయవచ్చు’’ అని శరత్‌ బెలావడి- సెంటర్‌ హెడ్- ఇనార్బిట్‌ మాల్‌, హైదరాబాద్‌ అన్నారు.

 
ఈ వాకిన్‌ క్యాంప్‌లో తమ పిల్లలకు టీకాలను వేయించాలనుకునే తల్లిదండ్రులు ఆరోగ్యసేతు యాప్‌లో ముందుగా తమ పిల్లల పేర్లను నమోదు చేయడంతో పాటుగా తమ పిల్లల ఆధార్‌ కార్డులను సైతం తమతో పాటుగా తీసుకురావాల్సి ఉంటుంది. తద్వారా వారు మొదటి మోతాదు టీకాను తమ పిల్లలకు అందించవచ్చు.


టీకా తీసుకున్న వ్యక్తులు ఏదైనా అసౌకర్యం ఎదుర్కొంటే టీకా ప్రాంగణం వదిలి వెళ్లేందుకు ఖచ్చితంగా 30 నిమిషాలు వేచి ఉండాల్సి ఉంటుంది. అవసరమైన రోగులకు సహాయమందించేందుకు డాక్టర్లతో కూడిన ఓ బృందం అందుబాటులో ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్‌ శిబిరం గురించిన మరింత సమాచారం కోసం 80080 45704 సంప్రదించాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ విమానాలపై ఫిబ్రవరి నెలాఖరు వరకు నిషేధం