అయేషా మీరా తల్లితండ్రులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశారు. సరిగ్గా 14 ఏళ్ళ క్రితం ఇబ్రహీంపట్నం లేడీస్ హాస్టల్ లో అత్యంత పాశవికంగా ఆయేషా మీరా అనే విద్యార్థినిని హత్య చేశారు. దీనిపై అప్పట్లో హాస్టల్ యాజమాన్యంపై అయేషా తల్లితండ్రులు ఆరోపణలు చేశారు.
కానీ, ఆయేషా మీరా హత్య జరిగి 14 సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు ఆ కేసులో న్యాయం జరగలేదు. ఆమె హత్యకేసులో వందాలది మందిని విచారించి, చివరికి సత్యంబాబును దోషిగా నిలబెట్టారు. కానీ, చివరికి కోర్టు సత్యంబాబు కూడా నిర్దోషి రెండేళ్ళ క్రితం విడుదల చేసింది.
ఒక అమ్మాయి దారుణంగా హత్య అయితే, 14 ఏళ్ళు అయినా నిందితులు దక్కని ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయేషా తల్లితండ్రులు బహిరంగ లేఖను రాశారు. డిసెంబర్ 26 న ఉదయం 10 గంటలకు విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో ఈ బహిరంగ లేఖను విడుదల చేస్తున్నామని, ఫ్రింట్, ఎలక్ట్రనిక్ మీడియా ప్రతినిధులు హజరు కావాలని అయేషా తల్లితండ్రులు ఇక్బాల్ బాషా, షంషద్ బేగం కోరారు.