Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కరోనా దూకుడు - 33 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Advertiesment
దేశంలో కరోనా దూకుడు - 33 వేలు దాటిన పాజిటివ్ కేసులు
, సోమవారం, 3 జనవరి 2022 (09:58 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దూకుడు మామూలుగా లేదు. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 33,750 మంది ఈ వైరస్ తాకిడికి గురయ్యారు. ఈ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,49,22,882కు చేరింది. వీటిలో 1,45,582 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, తాజాగా 123 మంది కరోనా బాధితులు మృతి చెందారనీ, ఈ మృతుల సంఖ్యతో కలుపుకుంటే మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 4,81,893కు చేరినట్టు వెల్లడించారు. అలాగే, ఆదివారం 10846 మంది కోలుకున్నారు. 
 
అదేసమయంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆదివారం దేశంలో మరో 123 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1700కు చేరింది. ఈ వైరస్ బారినపడినవారిలో 639 మంది కోలుకున్నారు. 
 
దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, కేరళ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, కర్నాటక, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉన్మాదిగా మారిన భర్త.. భార్యను పిల్లల్ని చంపేశాడు..