Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మే 3 వరకు లాక్‌డౌన్ : అనుమతులున్నవి.. అనుమతులు లేనివి ఏవి?

మే 3 వరకు లాక్‌డౌన్ : అనుమతులున్నవి.. అనుమతులు లేనివి ఏవి?
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (17:48 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీన్ని వచ్చే నెల మూడో తేదీ వరకు ఈ లాక్‌డౌన్‌ను పొడించడం జరిగింది. అయితే, ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో రెండో దశ లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం బుధవారం ఉదయం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. హాట్‌స్పాట్‌‌లేని ఏరియాల్లో ఏప్రిల్‌ 20 తర్వాత కొంత సడలింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ఈ పరిస్థితుల్లో 20వ తేదీ తర్వాత అనుమతులు ఉన్నవి ఏవి? అనుమతులు లేనివి ఏవి? అనే అంశాన్ని పరిశీలిస్తే, 
 
అనుమతులు లేనివి... 
* అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి నిరాకరణ (వైద్య, భద్రతకు సంబంధించిన విమానాలకు మినహాయింపు).
* రైళ్లు, బస్సులు, మెట్రో రైళ్లు సర్వీసుల నిలిపివేత.
* అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల మధ్య రవాణా నిషేధం (వైద్య సేవల వాహనాలకు మినహాయింపు) 
* విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు, కోచింగ్‌ కేంద్రాలు, సినిమా హాల్స్‌, మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, పార్కులు, బార్లు, ఆడిటోరియంలు మూసివేత.
* మత, దైవ ప్రార్థనలు నిషేధం.
 
అనుమతులు ఉన్నవి... 
* ఆస్పత్రులు, టెలీ మెడిసిన్‌ సర్వీసులు యధావిధిగా కొనసాగుతాయి. 
* ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, మెడికల్‌ షాపులు తెరిచేవుంటాయి. 
* ఔషధ పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు పనిచేస్తాయి. 
* బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి. 
* దివ్యాంగ, అనాథ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి. 
* నిబంధనల మేరకు పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి.
* ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు అనుమతి.
* వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు అనుమతి. పంట కోత యంత్రాల రవాణాకు అనుమతి.
 
* వ్యవసాయ పరికరాలు, విడి భాగాల దుకాణాలకు అనుమతి. వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చేందుకు అనుమతి.
* విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుల మందు దుకాణాలకు అనుమతి.
* ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి.
* దాణా సరఫరాకు అనుమతి.
* రోడ్డు పక్కన దాబాలు, వాహన మరమ్మతులకు అనుమతి. 
* ఉపాధి హామీ కూలీలకు అనుమతి.
* గ్రామాల్లో రోడ్లు, సాగునీటి పనులకు అనుమతి. 
* భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతి.
* కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరణ. 
* ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా సర్వీసులు కొనసాగుతాయి. 
* డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యధాతథం. 
* ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50 శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతి. 
* అంత్యక్రియలకు 20 మంది వరకు అనుమతి. వివాహాలకు, శుభ కార్యక్రమాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి.
* టీ, కాఫీ, రబ్బర్‌ ప్లాంటేషన్స్‌లో 50 శాతం కార్మికులతో పనులకు అనుమతి.
* పాలు, పాల ఉత్పత్తుల కేంద్రాలతో పాటు పాల క్రయవిక్రయాలకు అనుమతి. 
* ఆన్‌లైన్‌ టీచింగ్‌కు అనుమతి.
* పెట్రోల్‌, గ్యాస్‌ రవాణా సేవలు యధావిధిగా కొనసాగుతాయి. 
* ఈ-కామర్స్‌ సంస్థలు, వాహనాలకు అనుమతి. 
* గోదాములు, శీతల గోదాములకు అనుమతి.
* ఎలక్ట్రిషీయన్లు, ఐటీ రిపేర్లు, ప్లంబర్స్‌, మోటార్‌ మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసుపు, మిరప వంటి మసాలా దినుసుల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?