Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వ్యాప్తికి కారణమవుతున్న మద్యం దుకాణాలు, ఎక్కడ..?

కరోనా వ్యాప్తికి కారణమవుతున్న మద్యం దుకాణాలు, ఎక్కడ..?
, సోమవారం, 7 సెప్టెంబరు 2020 (11:06 IST)
కరోనా రోజుకురోజుకు పెరుగుతూనే ఉంది. దీనికంతటికి కారణం ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోవడమే. మద్యం దుకాణాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి, మందుబాబులు సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా.. కొన్ని మద్యం దుకాణాల దగ్గర అసలు పట్టించుకోవడం లేదు. ఇలా రూల్స్ బ్రేక్ చేస్తున్న మందుబాబుల వలన కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి.
 
సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూసుకోని మద్యం దుకాణాల యాజమాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోరు? అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే... మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పి.ఎస్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో గల నెం.1 మద్యం దుకాణంతో పాటు పలు మద్యం దుకాణాలు నిబంధనలు పాటించకుండా సామాజిక దూరం లేకుండా మద్యపానాన్ని విక్రయిస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. 
 
ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అనడానికి ఇదొక నిదర్శనంగా వుందనే ఆరోపణలు వస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో పాటించిన నిబంధనలు అన్లాక్‌డౌన్ చేయగానే కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కేసారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకుంటారులే అనే ధీమాతో వైన్ షాపుల యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు.
 
తమ వ్యాపారమే తమకు ముఖ్యం ఎవరైతే మాకేమీ... సమాజం ఏమైపోతే మాకేమి... అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే దబాయింపులు చేస్తున్న పరిస్థితి. వైన్స్ యాజమాన్యం పైన సంబంధిత పోలీస్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా లాక్‌డౌన్, భర్తతో గొడవపడ్డ భార్య, కత్తితో భర్తను పొడిచి హత్య