కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు నానా తంటాలు పడ్డాయి. కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పొరుగుదేశం చైనాను ఇప్పుడు మరో ఫ్లూ వేధిస్తోంది. ఈ కొత్త ఫ్లూ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్ యోచనలో వున్నట్లు తెలుస్తుంది.
ఈ నెల మొదటి వారంలో 25.1శాతంగా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం 41.6 శాతానికి పెరిగింది. అయితే, కరోనా కేసులు మాత్రం 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గడం ఊరటనివ్వడం గమనార్హం. జియాన్ నగరంలో ఫ్లూ కేసులు పెరగడంతో వాణిజ్య ప్రాంతాలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.