కోవిడ్ వ్యాక్సిన్ సృష్టికర్త అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైయ్యారు. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకున్న ఆండ్రీ బొటికోవ్.. మాస్కోలోని అపార్ట్‌మెంట్‌లో విగతజీవుడిగా కనిపించారు. ఓ బెల్టుతో ఆయన మెడకు ఉచ్చు బిగించి అంతమొందించినట్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బొటికోవ్ గమలేయా రీసెర్చ్ సెంటర్‌లో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. బొటికోవ్‌ను అప్పట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆఱ్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ద ఫాదర్లాండ్ అవార్డుతో సత్కరించారు.
కాగా బొటికోవ్ మరణంపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 29 ఏళ్ల యువకుడు ఒకరు బొటికోవ్ తో తీవ్ర వాగ్వాదం అనంతరం బెల్టును మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.