దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2 వేల 527 కేసులొచ్చాయి. 33 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు పెరగగా, మరణాలు తగ్గాయి. యాక్టివ్ కేసులు 15వేల 79కి పెరిగాయి. గత 24 గంటల్లో 1,656 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకుంటే రూ. 500 జరిమానా విధిస్తామని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి జె రాధాకృష్ణన్ శుక్రవారం తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించామని రాధాకృష్ణన్ తెలిపారు. ఏప్రిల్ 21న తమిళనాడులో 39 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఆ సంఖ్య 34,53,390కి చేరుకుంది.
అటు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 38,025గా ఉంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసి ఆదేశాలు జారీ చేసింది..లేనట్లైతే రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది.