Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లోకి మరో కొత్త కరోనా వేరియంట్...బీ.1.1.28.2

Advertiesment
Delta variant
భారత్‌లోకి మరో కొత్త కరోనా వేరియంట్ కాలు పెట్టినట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తాజాగా గుర్తించింది. బ్రెజిల్, ఇంగ్లండ్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో దీన్ని గుర్తించామని పేర్కొంది. ఈ కొత్త వేరియంట్‌ శాస్త్రీయ నామం బీ.1.1.28.2. ఈ వేరియంట్ వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 
 
ప్రస్తుతమున్న కరోనా టీకాలు ఈ వేరియంట్‌ను నిర్వీర్యం చేయగలవో లేదో తెలుసుకునేందుకు మరింత అధ్యయనం జరగాల్సి ఉందని వారు చెప్తున్నారు. కాగా.. దేశంలో కరోనా రెండో వేవ్ వెనుక బీ.1.617 రకం వేరియంట్లు ఉన్నట్టు పది పరిశోధన శాలలు జరిపిన తాజాగా అధ్యయనంలో బయటపడింది. ఈ రకం వేరియంట్ తొలుత మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. 
 
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలోనూ ఈ వైరస్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్‌కు చెందిన మూడు ఉపజాతులు అంటే..బీ.1.617.1, బీ.1.617.2, బీ.1.617.3 ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. వీటిలో బీ. 1.617.2 మిగితా వాటికంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కరోనా రెండో వేవ్‌కు ఇదే ప్రధాన కారణమనే అభిప్రాయం నిపుణుల్లో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్‌కు 'డెల్టా' అని నామకరణం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హస్తిన కేంద్రంగా ఆర్ఆర్ఆర్ లేఖాస్త్రాలు - ఈ దఫా గవర్నర్లకు...