Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

కరోనా బాధితులకు డెంగ్యూ వస్తే కష్టం.. ఢిల్లీ డిప్యూటీ సీఎంకు అదే పరిస్థితి...?

Advertiesment
Delhi Deputy CM
, శనివారం, 26 సెప్టెంబరు 2020 (14:46 IST)
Manish Sisodia
చైనా నుంచి పుట్టుకొచ్చి.. ప్రపంచ దేశాలకు పాకిన కరోనా వైరస్ కారణంగా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా వైరస్‌కు మందు ఇంకా రాలేదు. వ్యాక్సిన్ కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తోంది. కొన్ని వ్యాక్సిన్లు ట్రయల్ దశలో వున్నాయి. 
 
వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమయంలో కరోనా బారిన పడ్డ వారికి ఏదో ఒక ఔషదం ఇచ్చి వారి శరీర ఇమ్యూనిటీ పెంచేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కరోనా వ్యాధిగ్రస్థులకు డెంగ్యూ వస్తే పరిస్థితి మరింత సీరియస్‌గా మారుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..? ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు కరోనా పాజిటివ్‌ రావడంతో పాటు ఆయన డెంగ్యూ బారిన కూడా పడ్డారు. ఆయనకు చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా కష్టపడుతున్నారు. కరోనాకు ఇస్తున్న మందుల వల్ల డెంగ్యూ ప్రభావం పెరుగుతందని ప్లేట్‌ లెట్స్‌ తగ్గి పోతున్నాయంటూ వైద్యులు చెబుతున్నారు. 
 
ఇలాంటి సమయంలో రోగికి ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అందించాలో అర్థం అవ్వడం లేదంటూ వైద్యులు అంటున్నారు. ఈ పరిస్థితి నుండి అధిగమించేందుకు కొన్నాళ్లు పడుతుందని డెంగ్యూతో జాగ్రతగా ఉండటం మంచిదంటూ వైద్యులు హెచ్చిరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్-19.. ఏపీలో రోజుకు 7వేల కేసులు.. డీఎడ్ పరీక్షలు వాయిదా..