Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గినియాలో మరో భయంకరమైన వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు

గినియాలో మరో భయంకరమైన వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (13:03 IST)
ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. పైగా, ఈ వైరస్ జన్యుపరంగా పలు రకాలుగా రూపాంతరం చెందుతుంది. తాజాగా మరో భయంకరమైన వైరస్‌ను గుర్తించారు. దీనికి మార్ బుర్గ్ అనే పేరు పెట్టారు. ఇది ఆఫ్రికాలోని గినియా దేశంలో వెలుగు చూసింది. ఈ విషయన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 
 
ఈ ప్రాణాంతక వైరస్ చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. గబ్బిలాల నుండి ప్రజలకు వ్యాపించే ఈ వైరస్ కారణంగా జ్వరం తీవ్ర తలనొప్పితో పాటు రక్తస్రావం అవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో 24 శాతం నుంచి 88 శాతం వరకు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 
 
ఈ నేపథ్యంలో ప్రారంభంలోనే ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ పై పరిశోధనల‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందాన్ని పశ్చిమ ఆఫ్రికాకు పంపించినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి కారణంగా ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది ప్రజలు కరోనా బారిన పడి మృతి చెందారు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో డెల్టా వైర‌స్ కలకలం రేపుతోంది. క‌రోనా బారిన ప‌డి చాలామంది ప్ర‌జ‌లు ఆస్ప‌త్రుల్లో చేరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండేళ్ల బాలికను కొట్టి చంపేసిన తల్లి.. ఇంటి పని చేయనివ్వలేదని..?