Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యమా డేంజరస్ యెల్లో ఫంగస్, లక్షణాలు ఇలా వుంటాయి

యమా డేంజరస్ యెల్లో ఫంగస్, లక్షణాలు ఇలా వుంటాయి
, సోమవారం, 24 మే 2021 (15:56 IST)
బ్లాక్ ఫంగస్ ఒకవైపు విజృంభిస్తుంటే కొత్తగా యెల్లో ఫంగస్ పేరుతో కొత్త కేసులు నమోదవుతూ బెంబేలెత్తిస్తున్నాయి. ఈ వ్యాధి సంక్రమణ కేసులు ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ నుండి పసుపు ఫంగస్ సంక్రమణ కేసు నమోదైంది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ రెండింటి కంటే పసుపు ఫంగస్ చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ వ్యాధి సోకిన రోగి ప్రస్తుతం ఘజియాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
పసుపు ఫంగస్ లక్షణాలు ఇలా వుంటాయి
సోమరిగా వున్నట్లు అనిపిస్తుంది
ఆకలి లేకపోవడం
బరువు తగ్గడం
తీవ్రమైన సందర్భాల్లో పసుపు ఫంగస్ చీము కారడం
గాయాలు నెమ్మదిగా నయం కావడం
ఎంత తిన్నా వంటికి పట్టకపోవడం
అవయవ వైఫల్యం
నెక్రోసిస్ కారణంగా కళ్ళు మూసుకుపోవడం
 
ఇక వైట్ ఫంగస్ విషయం చూస్తే.. ఈ ప్రమాదం ఎవరికి ఉందో ఇంకా తెలియకపోయినా, కొంతమంది నిపుణులు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని చెపుతున్నారు. ఏదైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని చెప్పారు. డయాబెటిస్, క్యాన్సర్ మరియు ఇతర అనారోగ్యాలు ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలుపు ఫంగస్ సంక్రమణ లక్షణాలను విస్మరించవద్దు.
 
పసుపు ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రధానంగా అపరిశుభ్రత వల్ల వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా వుంచుకోవాలి. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నివారించడానికి నిల్వ వుంచిన ఆహారాలు తీసుకోరాదు. అలాగే కుళ్లిన  పదార్థాలను వీలైనంత త్వరగా తొలగించేయాలి.. అంటే డస్ట్ బిన్ వుండే చెత్త ఎక్కువ రోజులు నిల్వపెట్టుకోరాదు. వెంటనే పారేయాలి.
 
ఇంటిలో తేమ కూడా చాలా ముఖ్యం. ఎక్కువ తేమ బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి నిరంతరం ఏసీల్లో మగ్గటం కూడా మానుకోవడం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒంగోలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు.. హైవే కిల్లర్స్‌కు ఉరిశిక్ష