Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలూ జర జాగ్రత్త.. చిన్నారులపై కోరలు చాస్తున్న కరోనా

Advertiesment
పిల్లలూ జర జాగ్రత్త.. చిన్నారులపై కోరలు చాస్తున్న కరోనా
, గురువారం, 8 ఏప్రియల్ 2021 (08:41 IST)
కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఫలితంగా ప్రతి రోజూ లక్ష మందికిపైగా ఈ వైరస్ బారినపడుతున్నారు. అయితే, ఈ రెండో దశలో కరోనా వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. 
 
గ‌తేడాది ఈ మ‌హ‌మ్మారి పెద్ద‌ల‌పై విరుచుకుప‌డ‌గా, సెకండ్ వేవ్‌లో మాత్రం చిన్నారుల‌పై కోర‌లు చాచి బుస‌లు కొడుతోంది. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే దేశ వ్యాప్తంగా 79,688 మంది చిన్నారుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.
 
మార్చి 1 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మ‌ధ్య‌లో ఒక్క మ‌హారాష్ట్రలోనే 60,684 మంది చిన్నారుల‌కు క‌రోనా సోకింది. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారులు 9,882 మంది ఉన్న‌ట్లు తెలిపింది. 
 
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 5,940 మంది పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాప్తి చెంద‌గా, 922 మంది చిన్నారులు ఐదేళ్ల లోపు వారు ఉన్నారు. క‌ర్ణాట‌క‌లో 7,327(ఐదేళ్ల లోపు చిన్నారులు 871), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 3,004(ఐదేళ్ల లోపు చిన్నారులు 471) మంది పిల్ల‌ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.
 
ఇకపోతే, ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో 2,733 మంది పిల్ల‌లు క‌రోనా బారిన ప‌డ‌గా, ఐదేళ్ల లోపు చిన్నారులు 441 మంది ఉన్నారని రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. అయితే క‌రోనా సోకిన చిన్నారుల్లో అత్య‌ధికులు పేద‌రికం నుంచి వ‌చ్చిన వారే ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంబీబీఎస్ విద్యార్థినిని మాయ చేసిన తొమ్మిదో తరగతి విద్యార్థి.. ఎలా?