Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నపిల్లల్లో కనిపించే కరోనా లక్షణాలు ఏంటి?

Advertiesment
చిన్నపిల్లల్లో కనిపించే కరోనా లక్షణాలు ఏంటి?
, గురువారం, 8 ఏప్రియల్ 2021 (09:55 IST)
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తిలో ఎక్కువగా చిన్నారులు ఈ వైరస్ బారినపడుతున్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలో పిల్లలకు పెద్దగా ప్రమాదం లేదు. వారిలో ఇన్ఫెక్షన్ల తీవ్రత, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నాయని గణాంకాలు కూడా చెబుతున్నాయి. 
 
కానీ.. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆ పరిస్థితి కనిపించట్లేదని, కొత్త వేరియంట్లు పిల్లల్లో కూడా తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని ఎపిడమాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూపు మార్చుకుంటున్న కరోనా వైరస్‌ (కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో) గత ఏడాదితో పోలిస్తే వేగంగా వ్యాపిస్తోందని.. మరింత ప్రాణాంతకంగా మారుతోందని, రోగనిరోధక వ్యవస్థ, యాంటీబాడీల కన్నుగప్పి మరీ ఇన్ఫెక్షన్లకు కారణమవుతోందని ఇటీవలికాలంలో జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన పిల్లల్లో కనిపించే సమస్యలపై హార్వర్డ్‌ హెల్త్‌ ఒక నివేదికలో తెలిపింది. ఆ సమస్యలేంటంటే.... ఎడతెగని జ్వరం, చర్మంపై దద్దుర్లు, కాలివేళ్ల వాపు, కళ్లు ఎర్రగా మారడం, కీళ్లనొప్పులు, వికారం, పొత్తికడుపులో నొప్పి, జీర్ణ సమస్యలు, పెదాలు నల్లగా మారడం వంటి లక్షణాలు కనపడితే జాగ్రత్తపడాలని, వెంటనే ఆస్పత్రిలో చికిత్స చేయించాలని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్డౌన్ దెబ్బకు మా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం : ఉత్తర కొరియా చీఫ్