Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో మరో 71 కేసులు.. కర్నూలు రికార్డు - మొత్తం కేసులు 1403

ఏపీలో మరో 71 కేసులు.. కర్నూలు రికార్డు - మొత్తం కేసులు 1403
, గురువారం, 30 ఏప్రియల్ 2020 (12:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 71 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కర్నూలు జిల్లాలోనే ఏకంగా 43 కేసులు వెలుగు చూశాయి. ఈ మొత్తం 71 కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్యం 1403కు చేరింది.
 
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంల 6,497 మంది శాంపిళ్లను పరీక్షించగా 71 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,403గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని వివరించింది.
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,051గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 2, గుంటూరులో 4, కడపలో 4, కృష్ణాలో 10, కర్నూలులో 43, నెల్లూరులో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో మొత్తం కేసులు 386కు చేరాయి.
 
మరోవైపు, జిల్లాల వారీగా మొత్తం కేసులను పరిశీలిస్తే, అనంతపురం 61, చిత్తూరు 80, ఈస్ట్ గోదావరి 42, గుంటూరు 287, కడప 73, కృష్ణ 246, కర్నూలు 386, నెల్లూరు 84, ప్రకాశం 60, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 23, వెస్ట్ గోదావరి 56 కేసుల చొప్పున నమోదైవుండగా, విజయనగరం జిల్లాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 
 
ఇదిలావుంటే, దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,718 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 33,050కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 1,074 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.  
 
ఇప్పటివరకు కరోనా నుంచి 8,324 మంది కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 23,651 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇప్పటివరకు 8,324 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 9,915కి చేరింది. ఆ తర్వాత గుజరాత్‌లో 4,082 మందికి సోకగా, ఢిల్లీ‌లో 3,439 మందికి కరోనా సోకింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పచారీ కొట్టుకెళ్లిన యువకుడు.. భార్యతో ఇంటికొచ్చాడు.. ఎక్కడ?