Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస్కులతో పొంచివున్న అతిపెద్ద ముప్పు!! (video)

Advertiesment
Coronavirus
, గురువారం, 22 అక్టోబరు 2020 (11:25 IST)
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు సామాజిక భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, ముఖానికి ధరించే కరోనా మాస్కులతో ప్రపంచానికి పెను ముప్పుపొంచివుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు చిన్నా, పెద్దా అందరూ మాస్కులు ఉపయోగిస్తున్నారు. అయితే, వీటిలో చాలావరకు యూజ్ అండ్ త్రో మాస్కులే ఉంటున్నాయి. ఇలా ఏ రోజుకు ఆ రోజు వాడి పారేసే మాస్కుల వల్ల మరింత ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
బ్రిటన్‌లో ప్లాస్టిక్ మాస్కుల వినియోగం మరింత ఎక్కువగా ఉంది. అక్కడి ప్రజలు రోజుకో మాస్కు చొప్పున ఉపయోగిస్తే యేడాదికి 66 వేల టన్నుల కలుషిత వ్యర్థాలు, 57 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతాయని అంచనా.
 
వైరస్ అంటుకున్న మాస్కులు మట్టిలో కూరుకుపోవడం, జలాల్లో కలవడం వల్ల అది మరింత ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిజానికి ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పోరాడుతున్నాయి. 
 
కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్లాస్టిక్ మాస్కులు, గ్లౌజులను వాడుతున్నారు. కాబట్టి ఇది మరో విపత్తుకు దారితీయక మునుపే అప్రమత్తం కావాలని, భూమిలో కలిసిపోయే మాస్కులను తయారుచేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే, మళ్లీ మళ్లీ ఉపయోగించగలిగే మాస్కులను వినియోగించడం ద్వారా కూడా ఈ ముప్పు నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు.
 
ఇక, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాస్కులను తయారుచేస్తున్న దేశం చైనానే. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అక్కడి కంపెనీలు రోజుకు 11.60 కోట్ల యూనిట్ల మాస్కులు ఉత్పత్తి చేసేవి. ఇప్పుడు వాటి సామర్థ్యం మరింత పెరిగింది. 
 
ప్రస్తుతం మూడు రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. గుడ్డతో చేసినవి, సర్జికల్, ఎన్-95 మాస్కులు. చివరి రకం మాస్కులు అన్నింటికంటే శ్రేయస్కరం. ఇవి గాలి ద్వారా వచ్చే వైరస్‌లను నియంత్రించగలవు. 
 
వీటిలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక, క్లినికల్ మాస్కుల ఉపయోగం కూడా అంతంత మాత్రమే. ఈ రెండింటిని ఎప్పటికప్పుడు పారేయాల్సి ఉంటుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా కొత్త కేసులు 55 వేలు.. మృతులు 702