Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్.. ముంబైలో తొలి కోవిడ్-19 ఆస్పత్రి

Advertiesment
Corona
కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రంగంలోకి దిగి.. భారత దేశంలో తొలి ఆస్పత్రిని సిద్ధం చేసింది. భారత దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్-19 పేషెంట్ల కోసం ముంబైలో ఆస్పత్రిని ఆర్ఐఎల్ ఏర్పాటు చేసింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సహకారంతో సర్ హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కోవిడ్ 19 ఆస్పత్రిని నిర్మించింది. 
 
ఈ ఆస్పత్రికి కావాల్సిన నిధుల్ని రిలయెన్స్ ఫౌండేషన్ సమకూర్చింది. ముంబైలోని సెవెన్ హిల్స్‌లో 100 పడకలతో కూడుకున్నదని ఆర్ఐఎల్ స్పష్టం చేసింది. ఈ ఆస్పత్రిలో 100 బెడ్స్‌కి కావాల్సిన వెంటిలేటర్స్, పేస్‌మేకర్స్, డయాలిసిస్ మెషీన్, పేషెంట్ మానిటరింగ్ డివైజ్‌లు ఉన్నాయి. ఇక సర్ హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో క్వారెంటైన ట్రావెలర్స్‌కి ప్రత్యేకమైన సదుపాయాలున్నాయి. 
 
ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు ఐసోలేషన్ ఏర్పాట్లున్నాయి. పరస్పరం కలుషితం కాకుండా, ఇన్ఫెక్షన్‌ని కంట్రోల్ చేసేందుకు నెగిటీవ్ ప్రెజర్ రూమ్ కూడా ఈ ఆస్పత్రిలో వుంది. ఈ ఆస్పత్రిలో కరోనా వైరస్ పాజిటీవ్ పేషెంట్లకు చికిత్స అందిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాపై యుద్ధం : సత్య నాదెళ్ల అర్థాంగి భారీ విరాళం.. హీరో నితిన్ కూడా