దేశంలో గడిచిన 24 గంటల్లో 16,167 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. దీనితో దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,41,61,899కి చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,510కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. మరోవైపు గత 24 గంటల్లో 41 మంది మృతి చెందారు. దీనితో దేశంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్య 5,26,730కి చేరుకుంది.
మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.31 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలావుంటే మంకీపాక్స్ కలవరం కూడా గుబులుపుట్టిస్తోంది. ఇవికాక సీజనల్ వ్యాధులు సరేసరి. అందుకే ప్రతి ఒక్కరూ వీటి పట్ల జాగ్రత్తగా వుండాలనీ, మాస్కులను ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని హెచ్చరిస్తున్నారు.