Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిటికీలు తెరవండి.. ఫ్యాన్లు వేసుకోండి... అలా కరోనాను అంతం చేయండి..

Advertiesment
కిటికీలు తెరవండి.. ఫ్యాన్లు వేసుకోండి... అలా కరోనాను అంతం చేయండి..
, శుక్రవారం, 21 మే 2021 (08:27 IST)
సాధారణంగా కరోనా వైరస్ సోకిన రోగి తుమ్మినపుడు లేదా దగ్గినప్పుడు ఆ తుంపర్లు ఆ వ్యక్తి నుంచి 10 మీటర్ల దాకా వ్యాపించవచ్చని కేంద్రప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి 10 మీటర్ల దూరం వరకు వైరస్‌ గాల్లోనే ఉండవచ్చని, అందుకే భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించాలని సూచించింది. 
 
ఈ మేరకు కేంద్రప్రభుత్వం ‘వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోండి. మహమ్మారిని అంతం చేయండి’ అనే పేరుతో గురువారం కొత్తగా మార్గదర్శకాలను విడుదలచేసింది. ముఖ్యంగా, ఇందులో వెంటిలేషన్‌ను ‘సామాజిక రక్షణవ్యవస్థ’గా అభివర్ణించింది. గృహాల్లో, కార్యాలయాల్లో వైరస్‌ వ్యాప్తిని తగ్గించటానికి గాలి ధారాళంగా ప్రసరించే వెంటిలేషన్‌ వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలని తెలిపింది. 
 
కిటికీలు, తలుపులు మూసి ఉన్న గదుల్లో వైరస్‌ అక్కడక్కడే గాలిలో తిరిగి ఎక్కువ మందికి వ్యాపిస్తుందని, వెంటిలేషన్‌ ఉంటే గాలి బయటకు వెళ్లి వైరస్‌ సోకే ముప్పు తగ్గుతుందని పేర్కొంది.
 
కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే, 
* కిటికీలు తెరవండి..ఫ్యాన్లు వేసుకోండి!
* కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్‌ 10 మీటర్ల దాకా వ్యాపిస్తుంది. కాబట్టి, జాగ్రత్తలు తీసుకోవాలి.
* లక్షణాలు కనిపించనివారి నుంచి కూడా వైరస్‌ వ్యాపిస్తుంది.
* వైరస్‌ నుంచి రక్షణకు రెండు మాస్కులను ధరించటం లేదా ఎన్‌95 మాస్కును ధరించటం, భౌతిక దూరం, వెంటిలేషన్‌ తప్పనిసరి.
* ఆఫీసుల్లో కిటిటీలు తెరిచే ఉంచాలి. గాలి బయటకు వెళ్లేలా ఫ్యాన్లు వేస్తే మంచిది.
* షాపింగ్‌ మాల్స్‌, ఆడిటోరియంలలో రూఫ్‌ వెంటిలేషన్‌ తప్పనిసరి. పెద్ద పెద్ద భవంతుల్లో గాలి బయటకు వెళ్లేలా సెంట్రల్‌ ఎయిర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా సెల్ఫ్ కిట్... ఇక ఇంట్లోలోనే కోవిడ్ పరీక్షలు.. ధర రూ.250 మాత్రమే...