Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నారులపై పంజా విసిరిన కరోనా.. బెంగళూరులో 472 మందికి కోవిడ్

చిన్నారులపై పంజా విసిరిన కరోనా.. బెంగళూరులో 472 మందికి కోవిడ్
, సోమవారం, 29 మార్చి 2021 (15:24 IST)
ఇన్నాళ్లు పెద్దలపై పంజా విసిరిన కరోనా ప్రస్తుతం చిన్నారులపై మళ్లింది. సెకండ్ వేవ్‌లో రూటు మార్చింది. ఇప్పుడు పెద్ద వయసు వారితోపాటు చిన్నారుల్లో కూడా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 1 నుంచి బెంగళూరులో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 472 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. అందులో 244 మంది బాలురు, 228 మంది బాలికలు ఉన్నారు. 
 
మార్చి మొదటి వారంలో చిన్న పిల్లల్లో రోజుకు 10 కేసులు వరకు నమోదవగా.. రెండు రోజులుగా అవి విపరీతంగా పెరిగిపోయాయి. మొన్న ఒక్క రోజే 46మంది చిన్న పిల్లలు కరోనా పాజిటివ్‌గా తేలారు. గతంలో మాదిరిగా కాకుండా సిటీలో పిల్లలు ఇప్పుడు బహిరంగంగా బయట తిరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. లాక్‌డైన్‌ ముగిసి పరిస్థితులు సద్దుమణగడంతో కొన్ని తరగతుల వారికి స్కూల్స్‌ తిరిగి తెరిచారు. 
 
దీంతో చాలా మంది స్కూలుకు వెళ్లడంతో పాటుగా ఇంటి పక్కనుండే చిన్నారులతో ఆటలాడుడూ వైరస్‌ను స్ప్రెడ్ చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. పెద్ద వారు ఉద్యోగాలకు వెళ్లడం, బహిరంగ ప్రదేశాల్లో మార్గదర్శకాలు పాటించకుండా తిరుగుతుండటంతో వారి నుంచి చిన్నారులకు వైరస్ సోకుతోందనే వాదన కూడా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ సీఎం అక్రమ వ్యవహారం నుండి పుట్టిన శిశువు- రాజా: ఎడప్పాడి కన్నీటి పర్యంతం