Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్.. ఉద్యోగాలను కూడా ఊడగొట్టేస్తుందట..

Advertiesment
కరోనా వైరస్.. ఉద్యోగాలను కూడా ఊడగొట్టేస్తుందట..
, గురువారం, 30 ఏప్రియల్ 2020 (18:18 IST)
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైనాయి. వైరస్ కారణంగా ఒకవైపు ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఉద్యోగాలు కూడా కరోనా ఊడగొట్టేస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ మహమ్మారి త్వరలో కోట్ల మందిని రోడ్డు పాలు చేయనుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా ప్రకారం తేలింది. 
 
ఐఎల్‌వో అంచనా ప్రకారం అసంఘటిత రంగంలో 160 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్క్ ఫోర్స్‌తో చూస్తే ఈ సంఖ్య సగం అని వివరించింది. కాగా.. ఈ ప్రభావం అమెరికా, యూరప్, మధ్య ఆసియాలో ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
 
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనే 30 కోట్ల మంది ఫుల్ టైం జాబ్స్ పోతాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 43.6 కోట్ల చిన్న, పెద్ద కంపెనీలు మూతపడే అవకాశం ఉందని నివేదికలో ఐఎల్‌వో తెలిపింది.
 
ఇప్పటికే, ప్రపంచంలోని రెండు బిలియన్ల అనధికారిక కార్మికుల వేతనాలు మొదటి నెలలో ప్రపంచ సగటు 60 శాతానికి పడిపోయాయి, ప్రతి ప్రాంతంలో సంక్షోభం బయటపడిందని ఐఎల్ఓ తెలిపింది. 3.3 బిలియన్ల ప్రపంచ శ్రామిక శక్తిలో అనధికారిక కార్మికులు ఎక్కువగా కారణమవుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యకు కరోనా.. భర్త ఆత్మహత్య ఎక్కడంటే?