వేడివేడి టీని క్షణాల్లో తయారు చేయడం మాత్రమే కాదు... తేయాకును ఎంచుకోవడంలో, భద్రపరచడంలోనూ కొన్ని అంశాలనుదృష్టిలో పెట్టుకోవాలి. ఇందుకోసం... చక్కని సువాసనతో తాజాగా ఉండే తేయాకునే కొని, ఏడాదిలోపలే వాడేయాలి. గాలి చొరబడని డబ్బాలోనే నిల్వచేయాలి. ఈ డబ్బాను అన్నిటితో కలిపి కాకుండా విడిగా పెట్టాలి.