Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉల్లిపాయలను తరిగేటప్పుడు నోటిలో బ్రెడ్ ముక్కను పెట్టుకుంటే?

నోట్లో బ్రెడ్ ముక్కను పెట్టుకుని ఉల్లిని తరగడం ద్వారా అందులోని విడుదలయ్యే కన్నీళ్లు తెప్పింటే గ్యాస్ ప్రభావం తగ్గుతుంది. ఇంకా సన్ గ్లాసులను వేసుకుని ఉల్లిపాయల్ని తరగడం ద్వారా కన్నీళ్లు రావటాన్ని నిరోధ

Advertiesment
ఉల్లిపాయలను తరిగేటప్పుడు నోటిలో బ్రెడ్ ముక్కను పెట్టుకుంటే?
, సోమవారం, 27 మార్చి 2017 (13:16 IST)
ఉల్లిపాయలను తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే పొట్టు ఒలిచిన తర్వాత మధ్యలోకి కట్ చేసి నీటిలో వేసి పదినిమిషాల తర్వాత తరగాలి. బాదం పప్పును మరిగేనీటిలో పదినిమిషాలపాటు ఉంచి ఒలిస్తే పొట్టు సులభంగా వస్తుంది. అలాగే చల్లని నీటిలో ఉల్లిపాయల్ని ఉంచి ఆపై తరిగినా కన్నీళ్లు రావు.

ఇక నోట్లో బ్రెడ్ ముక్కను పెట్టుకుని ఉల్లిని తరగడం ద్వారా అందులోని విడుదలయ్యే కన్నీళ్లు తెప్పింటే గ్యాస్ ప్రభావం తగ్గుతుంది. ఇంకా సన్ గ్లాసులను వేసుకుని ఉల్లిపాయల్ని తరగడం ద్వారా కన్నీళ్లు రావటాన్ని నిరోధించుకోవచ్చు. 
 
ఇక కూరలలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వేయించిన వరిపిండిని కలపాలి. పప్పులో ఒక స్పూను రిఫైన్‌డ్‌ ఆయిల్‌ లేదా రెండు వెల్లుల్లి రేకలు వేసి వండినట్లయితే గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గుతుంది. కూరగాయలను ఉడికించేటప్పుడు ముందుగా నీటిని వేడిచేసి అప్పుడు ముక్కలను వేయాలి. ఎక్కువ సేపు నీటిలో ఉండేకొద్దీ పోషకాలు నశిస్తుంటాయి. కాబట్టి నీటిలో ఉండే సమయాన్ని తగ్గించడానికి ఈ పద్ధతిని అవలంబించవచ్చు. అలాగే కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత కూడా తెల్లగా ఉండాలంటే ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్ళలో రెండు టీ స్పూన్ల పాలు కలపాలి. చిక్కుళ్లు, పచ్చిబఠాణీలు, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ పంచదార కలిపితే సహజమైన రంగుని కోల్పోవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డయాబెటిక్ రోగులకు ఆయుర్వేద అమరసంజీవని నేరేడు