Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చపాతీ కర్రను శుభ్రం చేయకపోతే ముప్పే!

chapati wooden stick
, ఆదివారం, 8 అక్టోబరు 2023 (11:51 IST)
ప్రతి ఒక్కరి వంటింట్లో ఉపయోగించే వస్తువుల్లో చపాకీ కర్ర ఉంటుంది. అయితే దీనిని చాలా మంది సక్రమంగా శుభ్రం చేయరు. ఎలా శుభ్రం చేయాలో తెలియకపోవటం కూడా దీని వెనకున్న కారణాల్లో ఒకటి. చపాతీలు ఒత్తిన తర్వాత కర్రను ఎలా శుభ్ర పరచాలో చూద్దాం..
 
కర్రను ఎలా శుభ్రపరచాలి: వాడిన ప్రతిసారి కర్రను శుభ్రపరచాలి. ఒక పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీటిలో గిన్నెలు తోమే లిక్విడ్ వేయాలి. దీనిలో కర్రను ఉంచి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత పీచుతో కర్రను తోమాలి. బాగా గరుకుగా ఉన్న పీచుతో తోమితే కర్రకు చిన్న చిన్న రంధ్రాలు పడతాయి. దీని వల్ల చపాతీలు సరిగ్గా ఒత్తలేము.
 
సీజనింగ్ : కర్ర ఆరిపోయిన తర్వాత దానిపై కొద్దిగా కొబ్బరి నూనె వేసి బాగా తుడవాలి. ఇలా తుడిచి 30 నిమిషాలు ఆరబెట్టాలి. ఆ తర్వాత పొడిబట్టతో దానిని తుడవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే కర్ర ఎక్కువ కాలం మన్నుతుంది. 
 
పరిశుభ్రం చేయండి : కొన్ని సార్లు ఎంత కడిగినా - పిండి చిన్న చిన్న కన్నాలలో ఉండిపోతుంది. వీటిలో బ్యాక్టీరియా చేరుతుంది. ఇలా బ్యాక్టీరియా చేరిన కర్రతో చపాతీలు వత్తితే ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల అప్పుడప్పుడు ఈ కర్రను పరిశుభ్రం చేయాలి. దీని కోసం ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకొని.. వాటిలో వెనిగర్ వేయాలి. ఈ మిశ్రమంలో కర్రను కొద్ది సేపు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగి బయట ఎండలో ఆరబెట్టాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎముక పుష్టిని పెంచే ఆహారం ఏంటి?