Publish Date: Tue, 15 Jul 2008 (19:13 IST)
Updated Date: Tue, 15 Jul 2008 (19:13 IST)
కావలసిన పదార్థాలు :
ఉడికించిన బఠాణీలు... అర కప్పు
ఆలు తురుము... రెండు కప్పులు
కారం... ఒక టీస్పూన్
మైదా... రెండు టీ స్పూన్లు
సేమ్యా... ఒక కప్పు
కొత్తిమీర తరుగు... 1/4 కప్పు
ఉల్లి తరుగు... రెండు కప్పులు
తయారీ విధానం :
ఆలు, ఉల్లి, బఠాణీల తురుములలో కాస్త నీటిని చేర్చి ముద్దలా చేసుకొని, ఆ పిండితో చిన్న చిన్న రోల్స్‌గా పట్టి వాటిని మైదాపిండిలో ముంచాలి. ఆ తరువాత ఆ రోల్స్‌ను సేమ్యాలో వేసి అటూ ఇటూ తిప్పి బాగా అంటుకునేటట్లు చూడాలి. ఇక ఆ రోల్స్‌ను బాగా కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి దించాలి. వీటిని గ్రీన్ చట్నీ లేదా టమోటా సాస్ కలిపి తినవచ్చు.