Article Continental Food %e0%b0%b5%e0%b1%86%e0%b0%b0%e0%b1%88%e0%b0%9f%e0%b1%80 %e0%b0%9f%e0%b1%8b%e0%b0%ab%e0%b1%82 108040500005_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెరైటీ టోఫూ

Advertiesment
ప్యాన్‌ కాస్త నూనె టోఫూల పాత్ర స్టవ్‌ బటర్ కరగగానే మిర్చి ఫ్లేక్స్‌ ఉల్లిముక్కలు
కావలసిన పదార్థాలు :
టోఫూ - కప్పు, క్యారెట్ - అర కప్పు, బెల్ పెప్పర్ - పావు కప్పు, బీన్స్ - అర కప్పు, కాలీఫ్లవర్ ముక్కలు - అర కప్పు, ఉల్లి ముక్కలు - పావు కప్పు, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి - నాలుగు, అల్లం - టేబుల్ స్పూన్, బటర్ - మూడు టేబుల్ స్పూన్లు, మిర్చి ఫ్లేక్స్ - ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ - ఒకటిన్నర స్పూన్లు, ఉప్పు - సరిపడ.

తయారు చేయు విధానం :
ఓ ప్యాన్‌లో కాస్త నూనె వేసి అందులో టోఫూలను వేసి వేయించాలి. మరో పాత్రను స్టవ్‌ మీద పెట్టి బటర్ వేయాలి. అది కరగగానే, అందులో మిర్చి ఫ్లేక్స్‌ను వేసి వేయించాలి. తర్వాత ఇందులో అల్లం, ఉల్లిముక్కలను వేసి వేయించాలి.

ఆ తర్వాత తరిగిన కూరల ముక్కలను ఇందులో వేసి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఎనిమిది నుంచి పది నిముషాల వరకు సన్నని మంటపై ఉడికించాలి. తర్వాత మూత తీసి కాసిని నీళ్లు పోయాలి. నీళ్లు ఇంకేంత వరకు ఉడికించాలి. ఓ మోస్తరుగా ఉడికిన తర్వాత ఇందులో సోయా సాస్ వేసి తిప్పాలి.

ఈ మిశ్రమంలో టోఫూను వేసి బాగా తిప్పాలి. అన్ని కలసి కమ్మని వాసన వచ్చాక దించి సర్వ్ చేయండి. దీనిని అలానే తినవచ్చు లేగా నూడుల్స్‌తో కలిపి కూడా తినవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu