Publish Date: Thu, 08 Jan 2009 (20:13 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (19:48 IST)
కావలసిన పదార్థాలు :
కోడిగ్రుడ్లు... రెండు
మైదాపిండి... 150 గ్రాములు
బేకింగ్ పౌడర్... పావు టీస్పూన్
వెనిల్లా... పావు టీస్పూన్
పాలు... మూడు టీస్పూన్లు
తయారీ విధానం :
కోడిగ్రుడ్డులోని సొననంతా తీసుకుని బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమంలో పంచదార, వెన్నను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు వంటసోడాతో కలిపి ఉంచుకున్న మైదాపిండిని, పాలను కోడిగుడ్డు సొన మిశ్రమంతో పాటుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే కాస్తంత వెనిల్లా ఎసెన్స్‌ను కూడా కలపాలి.
ఏవేని చిన్న చిన్న గిన్నెలను తీసుకుని అందులో లోపలి వైపు నూనె రాసి వాటిల్లో... పైన కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని పోసి, 200 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వద్ద, ఓ 20 నిమిషాలపాటు ఓవెన్లో బేక్ చేయాలి. అంతే వెనిల్లా బన్స్ రెడీ అయినట్లే...! వీటిని వేడి చల్లారిన తరువాత తింటే మంచి రుచితో మిమ్మల్ని అలరిస్తాయి.