Article Continental Food %e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be %e0%b0%95%e0%b1%87%e0%b0%95%e0%b1%8d 108081400045_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెనిల్లా కేక్

Advertiesment
వంటకాలు కాంటినెంటల్ వెన్న పంచదార గుడ్డు ఐసింగ్ షుగర్ మైదా పౌడర్ గులాబిరంగు
FileND
కావలసిన పదార్థాలు :
కరిగించిన వెన్న... 50 గ్రాములు
పంచదార పొడి... 50 గ్రాములు
గుడ్డు... ఒకటి
ఐసింగ్ షుగర్... 140 గ్రాములు
మైదాపిండి... 100 గ్రాములు
బేకింగ్ పౌడర్... అరటీస్పూను
వెనిల్లా ఎస్సెన్స్... పావు టీస్పూను
వేడి నీళ్ళు... ఒకటింపావు గరిటెడు
గులాబిరంగు... కొద్దిగా

తయారీ విధానం :
మైదా, బేకింగ్ పౌడర్ జల్లించుకోవాలి. వెన్నను, పంచదార పొడిని బాగా క్రీమింగ్ చేసుకోవాలి. గుడ్డులోని సొనను, వెనిల్లా ఎస్సెన్స్‌ను కలిపి బాగా గిలట్టి, క్రీముకు కలపాలి. ఈ రెండింటి మిశ్రమానికి మైదాను బాగా కలిపి, అవసరమైతే కొన్ని పాలు కలిపి, కాస్త జారుగా చేయాలి.

పిండిని రెండు సమభాగాలుగా చేసుకుని, ఒక భాగానికి గులాబిరంగు కలపాలి. రంగు కలిపిన పిండిని, మామూలు పిండిని విడి విడిగా పేపర్ కప్పుల్లో సగానికి పోసి, ట్రేలో ఉంచి 400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఓవెన్‌లో రెండు నిమిషాలపాటు బేక్ చేసుకోవాలి. కేక్ చల్లారిన తరువాత గ్లేజ్ ఐసింగ్‌తో అలంకరించి అతిథులకు సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu