Article Continental Food %e0%b0%b5%e0%b0%be%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d %e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b0%a8%e0%b1%8d %e0%b0%9c%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d 109081400083_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాటర్ మెలన్ జామ్

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
పుచ్చకాయ ముక్కలు... నాలుగు కప్పులు
యాపిల్స్... ఒక కేజీ
బొప్పాయి... అర కేజీ
అరటిపండ్లు... మూడు
బత్తాయి... మూడు
ద్రాక్ష... పావు కేజీ
పంచదార... ఒక టీ.
సిట్రిక్ యాసిడ్... రెండు టీ.

తయారీ విధానం :
ముందుగా యాపిల్స్‌ను ఆవిరిమీద ఊడికించాలి. పై తొక్క తీసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన చెప్పుకున్న అన్నిరకాల పండ్ల ముక్కలను కట్ చేసి, గింజలు లేకుండా తీసివేసి అడుగు మందం ఉండే పాత్రలో వేయాలి. అందులో కొద్దిగా నీరుపోసి మెత్తగా అయ్యేలా ఉడికించాలి.

గరిటెతో పండ్ల ముక్కలను కలుపుతూ, పంచదార కూడా వేసి ఉడికించాలి. పంచదార కరిగాక సిట్రిక్ యాసిడ్ వేసి, గట్టిపడేంతదాకా కలుపుతూ ఉండాలి. కొద్దిపాటి వేడి ఉన్నప్పుడే ఈ పదార్థాన్ని పొడిగా ఉండే జార్ లేదా బాటిల్‌లోకి తీసి, చల్లారనివ్వాలి. తరువాత గాలి చొరబడకుండా మూత గట్టిగా బిగించి ఫ్రిజ్‌లో నిల్వ చేసి, కావాల్సినప్పుడు బ్రెడ్, కుకీస్, ఇతర స్నాక్స్ ఐటమ్‌లతోపాటు కలిపి తినవచ్చు. అంతే వాటర్‌మెలన్ జామ్ తయారైనట్లే...!!

Share this Story:

Follow Webdunia telugu