Article Continental Food %e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b1%8d%e2%80%8c%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4%e0%b1%8b %e0%b0%b5%e0%b0%82%e0%b0%9f%e0%b0%95%e0%b0%82 108040500006_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్‌మాతో వంటకం

Advertiesment
రాజ్‌మా గింజలు బియ్యాన్ని శుభ్రం వండి రాజ్‌మా గింజలు బాణాలి నూనె అందులో ఉల్లిముక్కలు
కావలసిన పదార్థాలు :
రాజ్‌మా గింజలు - కప్పు, బియ్యం - రెండు కప్పులు, ఉల్లిపాయలు - మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - చెంచాన్నర, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - నాలుగు, నూనె - వేయించడానికి సరిపడ, మసాలా పొడి - చెంచా.

తయారు చేయు విధానం :
ముందుగా రాజ్‌మా గింజలను మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రాజ్‌మా గింజలను కూడా ఉడికించాలి. బాణాలిలో నూనె వేసి కాగాక అందులో ఉల్లిముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి కలపాలి.

అవి వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న రాజ్‌మాగింజలు, అన్నాన్ని వేసి తగినంత ఉప్పు, మసాలా పొడి వేసి బాగా కలపి దించేయాలి. తర్వాత రైతాతో దీనిని వేడిగా సర్వ్ చేయండి. రుచిగా ఉండటంతో రాజ్‌మాను పిల్లలు, పెద్దలు అందరూ తింటారు.

Share this Story:

Follow Webdunia telugu